- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
World Sleep Day : నిద్రలో ఉలిక్కి పడుతూ.. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే అసలు కారణం ఇదే..
దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై ప్రభావాల కారణంగా ప్రస్తుతం స్లీప్ డిజార్డర్స్ పెరిగిపోతున్నాయి. నిద్రపోతున్నప్పుడు గట్టిగా గురకపెట్టే రుగ్మతతో ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇది రిలేషన్‌షిప్స్‌పై ప్రభావం చూపుతోందని నిపుణులు చెప్తున్నారు. బాధిత వ్యక్తులు రాత్రిళ్లు తమకు తెలియకుండానే నిద్రలో గురకపెట్టడాన్ని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) అని కూడా అంటారు. దీనిబారిన పడిన వారు నిద్రపోయేటప్పుడు సడెన్‌గా శ్వాస తీసుకోవడాన్ని ఆపివేయడం, మళ్లీ తీసుకోవడం చేస్తుంటారు. ఈ సందర్భంగా బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురికావడంవల్ల శబ్దం వస్తుంది.
ఒక వ్యక్తి గురక సమస్యతో బాధపడుతుంటే అతని కుటుంబ సభ్యులు, భాగస్వామి కూడా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్లీప్ అప్నియా బాధితులు శ్వాస తీసుకునే క్రమంలో పెద్ద శబ్దం చేయడం ఇతరులను డిస్టర్బ్ చేస్తుందని శ్వాస కోశ నిపుణులు పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై, అలాగే సదరు వ్యక్తుల లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.
స్లీప్ అప్నియా లక్షణాలు
స్లీప్ అప్నియా ప్రధాన క్షణాల్లో ఒకటి బిగ్గరగా గురకపెట్టడం, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడాన్ని క్షణంపాటు ఆపి, మళ్లీ తీసుకోవడం, ఈ సందర్భంలో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవడం, శబ్దాలు చేయడం, ఉలిక్కి పడి మేల్కోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే తీవ్రమైన తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం కూడా స్లీప్ అప్నియా సింప్టమ్స్‌లో భాగంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే మెంటల్ డిజార్డర్స్, లిబిడో, ఇతర అనారోగ్యాలు తలెత్తవచ్చు. అంతేకాదు బాధితుల్లో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా 140 శాతం పెరుగుతుందని, హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ 60 శాతం, కరోనరీ హార్ట్ డిసీజెస్ రిస్క్ 30 శాతం పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే స్లీప్ అప్నియాకు తగిన చికిత్స తీసుకోవాలని శ్వాసకోశ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక జీవన శైలి మార్పులకు సంబంధించి అధిక బరువు తగ్గడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లను మానివేయడం గురక సమస్యను నివారిస్తాయి.
Read More..
ప్రేమ కోసం 8వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన మహిళ.. ఆపై ఏం జరిగిందంటే ?