ఒకే రంగును వేర్వేరుగా గ్రహిస్తున్న కళ్లు.. ఎందుకో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-01-18 14:58:21.0  )
ఒకే రంగును వేర్వేరుగా గ్రహిస్తున్న కళ్లు.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ :సెన్స్ ఆఫ్ విజన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? నిజానికి ఒకే దృశ్యం ఒకరికంటే ఎక్కువమంది వేర్వురుగా గ్రహించే భిన్నమైన పరిస్థితి లేదా ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. మీరు సహజంగా ఎరుపు, నలుపు, పసుపు తదితర రంగులు కలిగిన దుస్తులను, వస్తువులను చూస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా? వాటి కలర్ ఏదో క్లియర్‌గా గుర్తించలేకపోయారా? మీరు చెప్పిన కలర్ నిజం కాదని ఎవరైనా సూచించారా? అంటే మీరు కచ్చితంగా ఆప్టికల్ ఇల్యూషన్‌ అనే రుగ్మతను కలిగి ఉన్నట్లు లెక్క. దీనివల్ల బాధిత వ్యక్తులు సహజమైన రంగులను భిన్నంగా గ్రహిస్తారు. మెదడు, కళ్లు కలర్స్‌ను అర్థం చేసుకునే విధానంలో ఏర్పడే ఆటంకాలవల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

వాస్తవానికి కళ్లు మూడు రకాల కలర్ సెన్సింగ్ సెల్స్‌ను కలిగి ఉంటాయి. వీటినే కోన్స్ అంటారు. ఒక వస్తువును చూసినప్పుడు, కాంతి ఆ వస్తువు ఉపరితలం నుంచి ప్రతిబింబిస్తుంది. అలాగే కళ్లల్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మీ కళ్లల్లోని కోన్ కణాలు బ్రెయిన్‌కు సిగ్నల్స్ అందిస్తాయి. అప్పుడు మీరు రంగును గుర్తించగలుగుతారు. ఇదంతా జరగాలంటే కోన్స్ పనితీరు సక్రమంగా ఉండాలి. అప్పుడే వివిధ దృశ్యాలను చక్కగా గుర్తిస్తారు. అయితే కొంతమందికి జన్యువైవిధ్యంవల్ల ఇలా గ్రహించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఫలితంగా కళ్లలోని కోన్స్ సక్రమంగా పనిచేయవు. ఈ పరిస్థివల్ల కలర్ అవగాహనలో తేడాలు సంభవిస్తుంటాయి. ఇక్కడే వ్యక్తుల సెన్స్ ఆఫ్ విజన్ మారుతుంది.

కలర్ పర్సిప్షన్

రంగులను గుర్తించడంలో కలర్ పర్సిప్షన్ (వర్ణ అవగాహన) ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది పూర్తిగా వ్యక్తి సొంత ఆలోచనకు సంబంధించిందని, ఆత్మాశ్రయమైనదని, కలర్ ఎలా ఉండాలనే దానికి యూనివర్సల్ ప్రమాణం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రంగు అవగాహనను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రంగుల పట్ల వ్యక్తుల అవగాహన కాలక్రమేణా వివిధ లైటింగ్ పరిస్థితులలో స్థిరంగా ఉండకపోవచ్చు. వ్యక్తులు కలర్‌ను విభిన్నంగా గుర్తించడానికి కోన్ కణాల సంఖ్య, సున్నితత్వంలోని వ్యక్తిగత వ్యత్యాసాలు కారణం అవుతాయి. కొంతమంది వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువ లేదా తక్కువ కోన్ సెల్స్ కలిగి ఉండవచ్చు లేదా వారి కోన్ సెల్స్ కాంతికి సంబంధించిన నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాలకు భిన్నంగా స్పందించవచ్చు. ఈ క్రమంలో ఆప్టికల్ ఇల్యూషన్ కొందరిని వేధిస్తుంది.

వయస్సును బట్టి మారుతుందా?

విజన్ ఆఫ్ సెన్స్ వయస్సు మీదపడిన వ్యక్తుల్లో మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐ లెన్స్ స్పష్టతను గుర్తించడంలో బలహీనంగా మారుతాయి. దీనివల్ల కలర్స్ ఎఫెక్టివ్‌గా కనిపించవు. అలాగే కంటిశుక్లం లేదా మచ్చలు ఏర్పడటం వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా కలర్ అవగాహనను ప్రభావితం చేస్తాయి. కాంతి పరావర్తన పరిస్థితులను రంగు అవగాహనను ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన విషయమని నిపుణులు చెప్తున్నారు. అలాగే కొన్ని సంస్కృతులలో నిర్దిష్ట రంగులు, నిర్దిష్ట భావోద్వేగాలు లేదా అర్థాలతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు వెస్టర్న్ కల్చర్‌లో రెడ్ తరచుగా అభిరుచి లేదా ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. ఆసియా సంస్కృతులలో ఇది అదృష్టం లేదా ఆనందంతో ముడిపడి ఉండవచ్చు. దీనివల్ల ఆయా సంస్కృతుల వారు కలర్‌ను గ్రహించడంలో తేడాలు ఉంటాయి. కాబట్టి భిన్న దృశ్యాలన్నీ కొన్ని సందర్భాల్లో రుగ్మతలు కావు. జన్యులోపాలు, వయస్సు మీద పడటంవల్ల అవగాహనలో తేడాలు రావడాన్ని ఆప్టికల్ ఇల్యూషన్‌గా నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ సెన్స్ ఆఫ్ విజన్ మారినప్పుడు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed