- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదివింది గుర్తుండట్లేదా?.. మెమరీ పవర్ పెరగాలంటే ఇలా చేయండి?
దిశ, ఫీచర్స్ : చదివింది గుర్తుండట్లేదా? లాస్ట్ వీక్ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపిన క్షణాలు అప్పుడే మర్చిపోయారా? అయితే అది మీ జ్ఞాపశక్తి సమస్యవల్ల కావచ్చు. డైలీ మనం తీసుకునే ఆహారాలు కూడా మెమరీ పవర్‌పై ఎఫెక్ట్ చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. కొన్నిరకాల ఫుడ్స్, డ్రింక్స్ మెమరీ పవర్ పెంచడంలో సహాయపడతాయని యూఎస్‌కు చెందిన మానసిక నిపుణుడు కింబర్లీ విల్సన్ అంటున్నారు. ముఖ్యంగా రెడ్ గ్రేప్స్, బ్లూ లేదా పర్పుల్ బెర్రీస్ జ్ఞాపకశక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటి నుంచి సేకరించిన జ్యూస్‌ను రోజుకు 500 మిల్లీలీటర్ల మేరకు 12 వారాలపాటు తాగితే వృద్ధుల్లో కూడా మెమరీ పవర్ పెరుగుతుందట.
ఇక పిల్లలపై నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం 240 గ్రాముల ఫ్రెష్ బ్లూబెర్రీస్‌ను కొంతకాలం ఆహారంగా తీసుకుంటున్న పిల్లలు, వీటిని తీసుకోని వారికంటే కూడా ఎక్కువ విషయాలను, ఎక్కువ సెంటెన్స్ గుర్తుంచుకుంటారు. ఇంతకీ రెడ్ గ్రేప్స్, బ్లూ, పర్పుల్ బెర్రీస్‌లో మాత్రమే జ్ఞాపశక్తిని పెంపొందించే లక్షణాలు ఎందుకు ఉంటాయంటే.. వీటిలో ముదురు రంగుకు దోహదం చేసే ఆంథోసియానైన్స్ అనే పాలీఫెనాల్స్ అధికంగా ఉండటమే కారణమని డైటీషియన్లు చెప్తున్నారు. ఇవి మెదడుకు బ్లడ్ సర్క్యూట్ మెరుగు పరుస్తాయి. మరిన్ని పోషకాలను, ఆక్సిజన్‌ను సమర్థవంతంగా అందిస్తాయి. నరాలను ఉత్తేజ పర్చి మెమరీ పవర్‌ను పెంచుతాయి.
Also Read: పవర్ ప్లాంట్ కండెన్సర్ కోటింగ్‌ను కనుగొన్న సైంటిస్టులు.. పర్యావరణంలో CO2ను తగ్గిస్తుందట