- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Periods: పీరియడ్స్ టైంలో వీటిని తింటే ఆ సమస్యలు పెరుగుతాయంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: మహిళల్లో కొందరు పీరియడ్స్ సమయంలో చాలా నీరసం అవుతుంటారు. మరి కొందరైతే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోతుంటారు. దీనికి గల కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవడం. మంచి ఆహారం తీసుకోవాలి అలా అని తినకూడనివి తిని కొత్త సమస్యలు తెచ్చుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
మసాలా ఫుడ్స్
రుతుక్రమ సమయంలో మసాలా ఫుడ్స్ ఉన్న ఆహారాలను దూరం పెట్టాలి లేదంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సమోసాలు, శనగ పిండి వంటకాలు, వేయించిన ఆహారాలలో ఎక్కువ నూనె ఉంటుంది. కాబట్టి ఇవి తినకపోవడమే మంచిది. తిన్న తర్వాత రుతుస్రావం ఎక్కువుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్వీట్స్
స్వీట్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ తీపి పదార్ధాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. దీని వలన మీ శరీరాన్ని మరింత గందరగోళంగా మారుస్తుంది.
పాలు
పీరియడ్స్ సమయంలో పాలు అందరికి మంచిది కాదు కొందరికి మిల్క్ తాగగానే వాంతులు అవుతాయి. ఇలాంటి వారు మిల్క్ తో పాటు పెరుగును కూడా దూరం పెట్టండి. లేదంటే గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.