Food allergy : పిల్లల్లో ఆస్తమాకు దారితీస్తున్న ఫుడ్ అలెర్జీ.. అధ్యయనంలో వెల్లడి

by Prasanna |   ( Updated:2023-07-27 06:35:31.0  )
Food allergy : పిల్లల్లో ఆస్తమాకు దారితీస్తున్న ఫుడ్ అలెర్జీ.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : బాల్య దశలో పిల్లలు ఎదుర్కొంటున్న ఫుడ్ అలెర్జీలు వారిలో ఆస్తమా, ఊపిరితిత్తుల పనితీరులో తక్కువ సామర్థ్యానికి కారణం అవుతున్నాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. ప్రారంభ ఆహార అలెర్జీలతో బాధపడుతున్న పిల్లల శ్వాసకోశ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌ ఇది సహాయపడుతుందని వెల్లడించింది. స్టడీలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోగల ముర్డోక్ చిల్డ్రన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(MCRI)కు చెందిన పరిశోధకులు 5, 276 మంది పిల్లలను పరిశీలించారు. ప్రారంభ జీవితంలో వారు ఏయే ఆహారాల ద్వారా అలెర్జీల బారిన పడేవారు, ఆ తర్వాత ఎటువంటి ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనేది గమనించారు.

ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు చిన్ననాటి ఆహార అలెర్జీల ప్రభావం ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇక్కడ 10 శాతంకంటే ఎక్కువమంది శిశువులను ఇది ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం కూడా ప్రతీ 13 మంది పిల్లలలో ఒకరికి ఫుడ్ అలర్జీ సమస్య ఉంటోంది. రోగనిరోధక వ్యవస్థ అలెర్జిక్ ఫుడ్ తీసుకోగానే అతిగా ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇది ప్రమాదకరమైందని, కొన్ని అలెర్జీలు ప్రాణాంతకం కూడా కావచ్చునని చెప్తున్నారు. తాజా అధ్యయనంలో ఏడాది వయస్సుగల పిల్లల్లో నాలుగు ఆహార అలెర్జీ కారకాలను పరిశోధకులు ఓరల్ ఫుడ్ ఛాలెంజ్‌లో భాగంగా స్కిన్ ప్రిక్ టెస్ట్ నిర్వహించడం ద్వారా గుడ్డు, వేరుశెనగ, నువ్వులు, రొయ్యలు, ఆవుపాలు కూడా అలెర్జీలకు కారణం అవుతున్నాయని గుర్తించారు. ఇక ఆరు సంవత్సరాల వయస్సుగల పిల్లల్లో కూడా పాలు, గుడ్లు, వేరుశెనగ, గోధుమలు, నువ్వులు, సోయా, రొయ్యలు, జీడిపప్పు, బాదం, హాజెల్‌నట్ ఫుడ్ అలెర్జీలను కలిగిస్తున్నాయని, ఇవి కొందరిలో ఆస్తమా, ఊపిరితిత్తుల తక్కువ సామర్థ్యానికి కారణం అవుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని, తరచూ అలెర్జీలు సంభవిస్తుంటే వైద్య నిపుణుల సలహాలు పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed