పెళ్లి ఇప్పుడే వద్దు.. యువతలో పెరిగిపోతున్న లేట్ మ్యారేజ్ ధోరణి.. సమస్యలు తప్పవంటున్న నిపుణులు

by Dishafeatures2 |
పెళ్లి ఇప్పుడే వద్దు.. యువతలో పెరిగిపోతున్న లేట్ మ్యారేజ్ ధోరణి.. సమస్యలు తప్పవంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటే.. స్త్రీ, పురుషులు జీవితాంతం కలిసి నడిచే పర్సనల్ లైఫ్ జర్నీ. ప్రపంచ వ్యాప్తంగా అర్హతగల వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇండియాలో అయితే అదొక పవిత్ర బంధం. కుటుంబ వ్యవస్థకు, సంపూర్ణ జీవితానికి ప్రతీక. అయితే ఇటీవల యువతలో పెళ్లి, కుటుంబం, వ్యక్తిగత జీవితం వంటి విషయాల్లో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చదువు, కెరీర్, లక్ష్యం, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ వంటి అంశాలకు ప్రయారిటీ ఇస్తున్న ఈతరం పెళ్లి చేసుకోవడంలో ఆలస్యం చేస్తోంది. దీనివల్ల తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

బాధ్యతలు మరింత భారం కావచ్చు

ఇప్పుడే ఎందుకనో, ఇంకా సెటిల్ కాలేదనో, ఆర్థికంగా స్థిరపడలేదనో తగిన వయస్సులో పెళ్లి చేసుకోడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు పలువురు. 30 నుంచి 35 ఏండ్ల వయస్సులో కూడా పెళ్లిచేసుకోని వారు ఇటీవల చాలామందే ఉంటున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కుటంబ బాధ్యతలు పెరుగుతాయని కొందరు ఇలా చేస్తుంటారు. కానీ లేటుగా చేసుకోవడంవల్లే ఆ బాధ్యతలు మరింత భారం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

తగాదాలు పెరిగే చాన్స్

నిర్ధిష్ట వయస్సులో పెళ్లి చేసుకోవడంవల్ల శారీరకంగా, మానసికంగా అనేక బెనిఫిట్స్ ఉంటాయి. లైంగిక ఆనందానికి, ఆరోగ్యానికి మేలు మంచిది. కానీ లేట్ మ్యారేజ్ వల్ల ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. పైగా నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత వ్యక్తుల్లో నిర్లక్ష్య ధోరణి, అహం స్థాయి వంటివి పెరగవచ్చు. ఇలాంటి సందర్భంలో పెళ్లి పీఠలెక్కేవారు ఆ తర్వాత జీవితంలో ఇబ్బందులు పడతారు. పరస్పరం అర్థం చేసుకోవడంలో, అవగాహన పెంచుకోవడంలో సమస్యలు వస్తాయి. గొడవలు, కుటుంబ కలహాలు పెరిగే చాన్సెస్ ఉంటాయి.

లైంగిక అసంతృప్తి, సంతానలేమి

జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అనే ఆలోచనతో మరింత లేటు చేయడంవల్ల తర్వాత వంధ్యత్వ సమస్యలు తలెత్తవచ్చు. సంతానలేమి సమస్యలకు గల కారణాలలో ప్రస్తుతం లేట్ మ్యారేజెస్ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే మహిళల్లో 30 ఏండ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తికి అనుగుణంగా వారి శరీరం సహకరించే అవకాశాలు తక్కువట. థైరాయిడ్, హార్మోనల్ ఇష్యూస్, అండాశయాల విడుదల వంటి ఇబ్బందులు వస్తాయి. మగవారిలో కూడా స్పెర్మ్ కౌంట్ లేదా వాటి మొబిలిటీ తగ్గే చాన్సెస్ ఉంటాయి. అలాగే 34 ఏండ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునేవారిలో 30 ఏండ్లలోపు వారితో పోల్చితే సెక్స్ కోరికలు, లైంగిక సంతృప్తి వంటి అంశాల్లో కొందరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే నిర్ధిష్ట వయస్సులో, కనీసం 28 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed