- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరచూ ఊహల్లో విహరిస్తున్నారా?.. ‘డెల్యూన్‌షిప్’ డిజార్డర్ కావచ్చు !
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా నేడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువతలో దీనిపై రోజురోజుకు మోజు పెరుగుతోంది. యూజ్ చేసుకునే తీరును బట్టి దాని ఉపయోగాలు ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల యూజర్లలో కొందరు బెనిఫిట్స్ పొందుతుండగా, మరి కొందరు నష్టపోతున్నారు కూడా. పలువురిలో ఇది వ్యసనంగానూ మారుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్), స్నాప్‌చాట్, లింక్డ్ ఇన్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడయా ఎకౌంట్స్‌లేని యంగ్ జనరేషన్ దాదాపు ఉండదనే చెప్పాలి. కొందరు డేటింగ్ యాప్‌లను కూడా యూజ్ చేస్తున్నారు. అలా చేయడంలో తప్పులేదు కానీ, కొందరు వాటికి అడిక్ట్ అవడంవల్ల నష్టపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తరచూ సోషల్ సైట్లలో నిమగ్నమవుతున్న కొందరిలో డెల్యూజన్‌షిప్ (Delusionship)అనే మెంటల్ డిజార్డర్ పెరిగిపోతోంది. ప్రజెంట్ పలు సోషల్ మీడియా వేదికల్లో దీనిపై డిస్కషన్ జరుగుతోంది.
డెల్యూజన్‌షిప్ అంటే ఒక విధమైన సోషల్ మీడియా వ్యసనంగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘డెల్యూజన్ ’ అంటే భ్రమ, భ్రాంతి, మాయ, ఊహాలోకంలో విహరించడం వంటి అర్థాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాలపై అతిగా డిపెండ్ అయ్యే యంగ్ జనరేషన్‌లో పలువురు ఇటీవల ఈ విధమైన బలహీనతలకు లోనవుతున్నారట. ముఖ్యంగా అబ్బాయిలు లేదా అమ్మాయిలు సోషల్ సైట్లలో.. ‘హలో, హాయ్’ అంటూ అపోజిట్ జెండర్స్ పలకరిస్తే చాలు. ఏదేదో ఊహించుకొని పులకరించి పోతున్నారట. మాటలు కలపగానే ఊహల్లో తేలిపోతున్నారట. ఈ విధమైన వింత ఫీలింగ్స్‌తో ఇతర అంశాలపై ఏకాగ్రత కోల్పోవడం, వర్కులో నాణ్యత తగ్గడం, భ్రమల్లో బతకడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనినే ‘డెల్యూజన్‌షిప్’గా తీవ్ర దశగా నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా అందరిలో ఇలాంటి ఫీలింగ్స్ వచ్చిపోతుంటాయి. కానీ అవి దీర్ఘకాలంపాటు వెంటాడుతుంటే మాత్రం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. అలాంటివారు సైకాలజిస్టులను సంప్రదించాలని సూచిస్తున్నారు.