Health: ఆయిల్ టిఫిన్స్ కన్నా.. చద్దన్నం బెటర్ అంటున్న నిపుణులు

by Prasanna |
Health: ఆయిల్ టిఫిన్స్ కన్నా.. చద్దన్నం బెటర్ అంటున్న నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్: పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. దీంతో ఒకటి కాదు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తారు. అయితే, మనలో కొందరు టిఫిన్ కి బదులు చద్దన్నం తింటుంటారు. ఇది కూడా మన ఆరోగ్యానికి మేలు.

పాత కాలంలో పెద్దలు ఇదే తీసుకునే వాళ్లు. అప్పట్లో టిఫిన్స్ ఉండేవి కావు. మిగిలిన అన్నంలో పెరుగు-ఉల్లి వేసుకుని మంచిగా ఆరగించేవాళ్లు. ఇప్పుడైతే పెరుగుని తినకుండా మజ్జిగ తాగుతున్నారు. అయితే, ఇలా రాత్రి అన్నంలో పెరుగు వేసుకుని తీసుకుంటే.. కడుపునొప్పి, పేగు సమస్యలు వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.

రాత్రి అన్నంలో పెరుగు వేసుకుని తింటే కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి కొందరైతే దద్దోజనంలా తింటారు. ఆయిల్ ఫుడ్స్ కన్నా .. ఇది చాలా బెటర్ అని పరిశోధనలు చేసి పోషకాహార నిపుణులు తెలిపారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed