మెంటల్ హెల్త్‌‌పై ఎఫెక్ట్ చూపుతున్న సోషల్ మీడియా.. అధ్యయనం

by Anjali |   ( Updated:2023-04-30 12:47:49.0  )
మెంటల్ హెల్త్‌‌పై ఎఫెక్ట్ చూపుతున్న సోషల్ మీడియా.. అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: ఈ జనరేషన్‌లో ఆల్మోస్ట్ అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ ఉంటే దాదాపు 80శాతం మందికి సోషల్ మీడియా ఎకౌంట్స్ ఉంటున్నాయి. ఇలా ట్విట్టర్, ఇన్‌స్టా, టిక్ టాక్ వంటి ప్లాట్ ఫామ్స్ స్క్రోల్ చేస్తున్న క్రమంలో వచ్చే సమాచారం, ప్రకటనలు యూజర్స్‌‌ను ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవికతతో సంబంధం లేకుండా ఎఫెక్ట్ అవుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. దీంతో అవసరం లేని ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారని, అధిక సంఖ్యలె లైక్స్ ఉన్న కంటెంట్‌కు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. ఈ కంటెంట్ మెదడును ప్రభావితం చేస్తూ.. వ్యక్తుల ప్రవర్తనలో మార్పునకు కారణమవుతోందని.. చిరాకు, అందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించింది.

సోషల్ మీడియా ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడానికి కొందరు అడ్వర్టైజింగ్ ప్రొఫెసర్లు 2022 చివరిలో 18 నుంచి 65 సంవత్సరాల వయస్సుగల అమెరికన్లను ఆన్‌లైన్ వేదికగా మూడుసార్లు స్టడీ చేశారు. వివిధ మానసిక పరిస్థితులను అనుభవిస్తున్న(mental loads) వ్యక్తులు ప్రకటనలకు భిన్నంగా ఎలా స్పందిస్తారో పరీక్షించారు.

ఇందుకోసం వారు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోషల్ మీడియాలో యూజర్లు ఒక ప్రకటన చూసేలా పోస్టు చేశారు. యూజర్లను వివిధ కేటగిరీలుగా విభజించారు. యాడ్ ఫొటో, క్యాప్షన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో తీరుగా స్పందించారు. అలాగే యూజర్లు తమకు నచ్చిన సమాచారం, పోస్టులు, లైకుల విషయంలో సానుకూలంగా స్పందిస్తుండగా, కొంతమంది తమకు నచ్చని సమాచారాన్ని చూసినప్పుడు ఆందోళనకు గురవుతున్నారు.

మరి కొందరు తమకు వ్యతిరేకంగా కంటెంట్ ఉన్నప్పుడు మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నారు. రిప్లయ్స్ ఇచ్చే వేళ, పోస్టుల కింద కామెంట్లపై వాదనలు జరుగుతున్న వేళ మెంటల్ కండిషన్ అప్ అండ్ డౌన్ పరిస్థితికి నెట్టబడుతూ కొందరు అలసిపోతారని నిపుణులు కనుగొన్నారు. అదే పనిగా తరచూ సోషల్ మీడియాలో స్ర్కోల్ చేస్తున్నవారు ఎక్కువగా మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయా విషయాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, కేవలం సోషల్ మీడియా కంటెంట్లకు అడిక్ట్ అవ్వడం ఇటువంటి పరిస్థితికి దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి:

చంద్రునిపై నుంచి ఆక్సిజన్‌ను వెలికి తీసిన నాసా సైంటిస్టులు

Advertisement

Next Story

Most Viewed