- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cannabis Medicine : మగువలకు గంజాయి మత్తు.. దివ్య ఔషధం! అబ్బురపడిపోతున్న గైనకాలజిస్టులు !!
దిశ, ఫీచర్స్ : గంజాయి మెడిసిన్ ఉమెన్ హెల్త్ మధ్య గల రిలేషన్‌షిప్ ఈనాటిది కాదు. శతాబ్దాల నాటి ప్రసూతి శాస్త్రం, స్త్రీ జననేంద్రియ శాస్త్రంలో గంజాయిని వైద్య పరిస్థితుల కోసం యూజ్ చేసుకునే లాంగ్ స్టాండింగ్ ట్రెడిషన్ కొనసాగిందని నిపుణులు చెప్తున్నారు. మోడర్న్ మెడికల్ రీసెర్చ్స్ కూడా స్త్రీలను ప్రభావితం చేసే వైద్య పరిస్థితులకు గంజాయి మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్‌పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలో దీనికి సంబంధించిన 2008 హిస్టారికల్ రివ్యూస్ ఉన్నాయి. ఇందులో గంజాయి, దాని సంబంధింత ఉత్పత్తులు, పదార్థాలను డిస్మెనోరియా, డైసూరియా, హైపెరెమిసిస్ గ్రావిడరమ్ వంటి అనేక రకాల రుగ్మతలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయ చికిత్సగా సూచించారు. మెనోపాజ్, డిప్రెషన్ నివారణలో కూడా యూజ్ అవుతుందని పేర్కొన్నారు. దీనిని సమర్థించే పరిశోధనలు ఇప్పటికే ఉన్నప్పటికీ, పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనల అవసరం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
మెన్‌స్ట్రువల్ హెల్త్
మెన్‌స్ట్రువల్ హెల్త్ విషయానికి వస్తే తిమ్మిరి ఎఫెక్ట్స్ తగ్గించడానికి గంజాయి మెడిసిన్ యూజ్ చేయడం అనేది చరిత్రలో ప్రస్తావించబడింది. క్వీన్ విక్టోరియా వంటి ప్రముఖులకు కూడా మెన్‌స్ట్రువల్ డిస్ కంఫర్ట్‌ను తగ్గించడానికి నెలవారీ ప్రాతిపదికన కన్నాబినాయిడ్ థెరపీని అప్పట్లో సూచించారట. ఇప్పటికే ఉన్న పలు పరిశోధనలు కూడా ఈ మెడిసిన్ సింప్టమేటిక్ మేనేజ్‌మెంట్ పొటెన్షియల్ సామర్థ్యాన్ని గుర్తించాయి. స్పెషల్లీ పెయిన్, తిమ్మిరి, ఉబ్బరం, వికారం, ఆకలి కోల్పోవడం వంటి రుతుక్రమ సంబంధిత లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి కాన్నాబినాయిడ్ ట్రీట్మెంట్ దోహదం చేస్తుంది. ఇది మానసిక స్థితికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఎమోషనల్ బిహేవియర్ కంట్రోలింట్ ట్రీట్మెంట్‌లోనూ హెల్ప్ అవుతుందట.
ఎండోమెట్రియోసిస్
దాదాపు ప్రతి తొమ్మిది మంది మహిళల్లో ఒకరు ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్‌తో సఫర్ అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. సర్జరీ అండ్ మెడికేషన్స్‌తో సహా ఇప్పటికే పలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. ఇవి ఎల్లప్పుడూ ఎఫెక్టివ్ పెయిన్ మేనేజ్‌మెంట్‌కు దోహదం చేయవు. పైగా వేరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ క్వాలిటీ లైఫ్ క్షీణతతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే 2019లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనం మాత్రం గంజాయి మెడిసిన్ ఎండోమెట్రియోసిస్ మహిళలకు అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. అప్పట్లో దీనిని ప్రయత్నించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఫుల్-స్పెక్ట్రమ్ గంజాయి, సీబీడీ కంటే ఎక్కువ ఎఫెక్టి్వ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. నొప్పిని తగ్గించడంతోపాటు వాంతులు, వికారం, గ్యాస్ట్రో ఇన్‌టెస్టినల్ సింప్టమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీస్ వంటి లక్షణాలను గణనీయంగా తగ్గాయి.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓడీ)
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ఒక హార్మోనల్ డిజార్డర్ అని తెలిసిన విషయమే. ఇది తరచుగా మహిళల్లో పెయిన్ అండ్ ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తుంది. రీప్రొడక్టివ్ ఏజ్ గల స్త్రీలలో సుమారు 5 నుంచి 10 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. కామన్ సింప్టమ్స్ ఏంటంటే.. ఇన్‌ఫెర్టిలిటీ, మెన్‌స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్, అబ్డామినల్ పెయిన్, బట్టతల, ఫేషియల్ హెయిర్ గ్రోత్, హెడ్‌ఎక్, వెయిట్ గెయిన్ అండ్ డిప్రెషన్ వంటివి పీసీఓడీ లక్షణాల్లో భాగంగా ఉంటున్నాయి. ఎండో కన్నాబినాయిడ్ సిస్టమ్ (ఈసీఎస్) మాడ్యులేషన్ ద్వారా పెయిన్, ఇన్‌ఫ్లమేషన్, డిప్రెషన్, యాంగ్జైటీ, వాపు, యాంగ్జైటీ, టైడ్‌నెస్, స్లీప్ డిస్ర్టబెన్స్ వంటి లక్షణాలను నిర్వహించడంలో కన్నాబినాయిడ్ మెడిసిన్ ఎఫెక్టివ్‌గా ఉంటాయని రీసెర్చ్‌లో తేలింది. అయితే 2013 సైంటిఫిక్ రివ్యూ ECS పనిచేయకపోవడం PCOSకి సంభావ్య కారణం కావచ్చని ఊహించింది. ఈ ఎవిడెన్స్ ECS అండ్ PCOS మధ్య రిలేషన్‌షిప్‌పై తదుపరి పరిశోధనకు సంబంధించిన ప్రయారిటీని నొక్కి చెబుతాయి.
మెనోపాజ్, రీ ప్రొడక్టివ్ హెల్త్
మెనోపాజ్‌కు సంబంధించిన సింప్టమ్స్ నిర్వహణలో గంజాయి మెడిసిన్ ఉపయోగ పడుతుందని 1924లో కూడా పలు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పేర్కొన్నాయి. ముఖ్యంగా హాట్ ఫ్లాషెస్, రాత్రి పూట చెమటలు, ఇస్నోమియా అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఈ మెడిసిన్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నాటి పరిశోధనలు సూచిస్తున్నాయి. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి ఎమోషనల్ చేంజెస్‌ను నిర్వహించడంలో కన్నాబినాయిడ్ థెరపీ ఎఫెక్టివ్‌గా పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక రీ ప్రొడక్టివ్ హెల్త్ విషయానికి వస్తే ఎండో కన్నాబినాయిడ్ సిస్టమ్ (ECS) పనితీరు నేరుగా మహిళల్లో రీ ప్రొడక్టివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ మెంట్‌తో ముడిపడి ఉంది. 2020 సైంటిఫిక్ రివ్యూ ప్రకారం ‘ఈ వ్యవస్థ చక్కటి-ట్యూనింగ్ రీ ప్రొడక్షన్ ప్రతీ స్టేజ్‌కు సంబంధించిన వెల్‌నెస్ అండ్ సక్సెస్‌కు దోహదం చేస్తుంది. ఫెర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ నుంచి పిండం అభివృద్ధి, డెలివరీ వరకు ఉపయోగాలు ఉన్నాయి. అలాగే బర్త్ కంట్రోల్ పిల్స్‌వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్ నివారణలోనూ గంజాయి మెడిసిన్ యూజ్ అవుతుందట.
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ (PPD)
కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు గురవుతుంటారు. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్‌గా గంజాయి మెడిసిన్ సామర్థ వంతంగా పనిచేస్తాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మదర్స్‌లో నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం, స్ట్రెస్, ఐసోలేషన్, అడిక్టివ్ సబ్‌స్టెన్సెస్‌ను అధిగమించడంలో గంజాయి మెడిసిన్స్ సహాయపడతాయని ఒక అధ్యయనం పేర్కొంది. అయినప్పటికీ న్యూ మదర్స్‌కు ఈ ఔషధాల వినియోగం ఎల్లప్పుడూ మంచిది కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. కన్నబినాయిడ్స్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా వ్యాపించే అవకాశాలపై ఎవిడెన్స్‌లు ఉన్నాయి. అందువల్ల గంజాయి మెడిసిన్ ప్రస్తుతం పాలిచ్చే తల్లులకు రెకమండ్ చేయబడదు.