పిల్లల్లో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెరగాలా?.. సమ్మర్ హాలిడేస్‌ని ఇలా సద్వినియోగం చేసుకోండి..

by Dishafeatures2 |
పిల్లల్లో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెరగాలా?.. సమ్మర్ హాలిడేస్‌ని ఇలా సద్వినియోగం చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ విషయంలో చాలా మేలు జరిగింది. కానీ దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల చాలామంది పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారనే ఆందోళన పేరెంట్స్‌లో వ్యక్తం అవుతోంది. దీనివల్ల సామాజిక పరిస్థితుల్లో, చదువులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. అలా జరగకూడదంటే పిల్లలు స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువసేపు గడపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

* పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌ను దూరం చేయడానికి వేసవి సెలవులను అవకాశంగా మల్చుకోవచ్చు. ఎక్కువసేపు ఇండ్లల్లో గడుపుతారు కాబట్టి పిల్లలు ఫోన్లల్లో మునిగిపోకుండా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట ప్రకృతిలో కాసేపైనా గడిపేలా చూడాలి. ఆటలు ఆడుకునేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. అలాగే మధ్యహ్నం వేళలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాగూ బయట తిరగరు. ఆ మసయంలో అవసరమైన నిద్రతోపాటు నిద్ర తర్వాత మెదడును చురుకుగా ఉంచే యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేలా చూడాలి.

* ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెరగానికి అవసరమైన పుస్తకాలను పిల్లలతో చదివించడం, ఫజిల్స్ సాల్వ్ చేయాలని చెప్పడం వంటి పనులు పేరెంట్స్ లేదా సంరక్షకులు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కలర్స్ దొరుకుతున్నాయి. పిల్లలు వాటిపట్ల ఉత్సాహం చూపుతుంటారు. కాబట్టి నచ్చిన డ్రాయంగ్ వేయడం, బొమ్మలు గీసి, వాటికి కలర్స్ ఫిల్ చేయడం వంటి పనులను ప్రోత్సహించడం ద్వారా మెదుడుకు పదును పెట్టవచ్చు. అలాగే కథల పుస్తకాలు చదివించడం, డ్యాన్స్, మ్యూజిక్, కరాటే వంటివి నేర్పించడం కూడా పిల్లల్లో మెదడు చురుకుదనాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పెంచుతాయి. సుడోకు వంటి గేమ్స్ లాజికల్ థింకింగ్‌‌ను ప్రోత్సహించడం ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుతాయి.



Next Story

Most Viewed