Brain - Memory : షాకింగ్ .. రాత్రి పడుకున్నాక మెదడులో ఇంత జరుగుతుందా...

by Sujitha Rachapalli |
Brain - Memory : షాకింగ్ ..  రాత్రి పడుకున్నాక  మెదడులో ఇంత జరుగుతుందా...
X

దిశ, ఫీచర్స్ : రాత్రి మంచి నిద్ర శక్తిని పునరుద్ధరిస్తుందని తెలుసు. కానీ కార్నెల్ విశ్వవిద్యాలయ కొత్త అధ్యయనం.. మెదడులో జ్ఞాపకశక్తిని రీసెట్ చేస్తుందని కనుగొంది. కొత్త విషయాలను నేర్చుకోవడం లేదా అనుభవించడం వల్ల జ్ఞాపకశక్తికి కీలకమైన మెదడులోని హిప్పోకాంపస్‌ న్యూరాన్‌లను క్రియాశీలం చేస్తుంది. తరువాత మనం నిద్రపోతున్నప్పుడు.. ఆ న్యూరాన్లు అదే విధమైన కార్యాచరణను పునరావృతం చేస్తాయి. అంటే మెదడు ఆ జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది. అవి కార్టెక్స్ అని పిలువబడే పెద్ద ప్రాంతంలో నిల్వ చేయబడతాయి.

సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం.. గాఢ నిద్రలో కొన్ని సమయాల్లో హిప్పోకాంపస్‌లోని కొన్ని భాగాలు నిశ్శబ్దంగా ఉండి.. ఆ న్యూరాన్‌లను రీసెట్ చేయడానికి అనుమతిస్తాయి. హిప్పోకాంపస్ CA1, CA2, CA3 అనే మూడు ప్రాంతాలుగా విభజించబడింది. CA1, CA3.. సమయం, స్థలానికి సంబంధించిన జ్ఞాపకాలను ఎన్‌కోడింగ్ చేయడంలో పాల్గొంటాయి. రోజంతా యాక్టివ్ గా ఉండి సడెన్ గా నిశ్శబ్దంగా మారిపోతాయి. కాగా ఈ స్థితి మధ్య ప్రాంతమైన CA2 ద్వారా జరుగుతుంది. కాగా ఈ మెకానిజం మెదడును మరుసటి రోజు కొత్తగా నేర్చుకునేందుకు అదే వనరులను, అదే న్యూరాన్‌లను తిరిగి ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed