ముంగిసపై కింగ్ కోబ్రా విషం కూడా పనిచేయదు.. కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే

by Prasanna |   ( Updated:2024-04-25 14:10:07.0  )
ముంగిసపై కింగ్ కోబ్రా విషం కూడా పనిచేయదు.. కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే
X

దిశ, ఫీచర్స్: పాము పేరు వింటేనే మనలో చాలా మంది భయపడి పారిపోతుంటారు. మీ కళ్ల ముందుకు వచ్చిన పాము కొన్ని నిముషాల పాటు ఉంటే ఏమి ఉండదు. పాము కాటుకు గురైన తర్వాత, తక్షణ సహాయం అందించకపోతే మరణిస్తారు. ఇది ఇలా ఉండగా పాముకి శత్రువుగా భావించే ముంగిస ఎలా బతుకుతుందనే అనుమానం అందరిలోనూ ఉంది. పెద్ద పెద్ద జంతువులు కూడా పాము విషానికి బలి అవుతాయి.

కానీ ముంగిస మాత్రం బతికేస్తుంది. పాము వర్సెస్ ముంగిస కొట్టుకుంటూనే ఉంటాయి. ముంగిసలు తరచుగా పెద్ద పాములను చంపుతాయి. పాములు ముంగిసల పిల్లలను తింటాయి. కానీ పెద్ద ముంగిసల విషయానికి వస్తే, అవి పామునే చంపుతాయి. నిజానికి ముంగీసల శరీరంలో ఎసిటైల్‌కోలిన్ ఉంటుంది. ఇది వాటి మెదడులో ఉండే న్యూరోట్రాన్స్మిటర్. రక్తంలో విషం యొక్క న్యూరోటాక్సిక్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల పాము విషం వల్ల ముంగిసలు చనిపోవు. అవి విషానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు పాములు ముంగిసల కంటే కూడా ఎక్కువ విషపూరితమైనవి.

ముంగిస, పాము మధ్య శత్రుత్వం సహజమేనని అటవీ వన్యప్రాణుల యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. పాములు ముంగిసలకు మాత్రమే ఆహారం. అవి పాములను ఆహారం కోసమే వేటాడతాయి. ఇవి ఎక్కువగా దాడి చేయవు. వాటి పిల్లలను పాము దాడి నుండి రక్షించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి. ఇండియన్ గ్రే ముంగిస అత్యంత ప్రమాదకరమైన పాము కిల్లర్‌గా పిలుస్తారు. ఇది కింగ్ కోబ్రాను కూడా చంపగలదని నిపుణులు అంటున్నారు.

Read More..

వరల్డ్ మలేరియా డే.. దోమలు ఎక్కువగా చెమటలు పట్టేవారినే ఇష్టపడుతాయని తెలుసా?

Advertisement

Next Story