పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!

by Aamani |   ( Updated:2023-05-17 08:02:48.0  )
పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం.. ఈ పదం వినాలన్నా, ఉచ్చరించాలన్నా సిగ్గుపడిపోతారు. అదో బూతు పదంగా ముడుచుకుపోతారు మహిళలు.కానీ పడక గదిలో మాత్రం ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. నచ్చిన చెలికాడుతో రతి క్రీడలో రాజ్యమేలుతారు. మనసుకు నచ్చిన వాడిని మల్లెతీగలా అల్లుకుపోతారు. నిలువెళ్లా సమర్పించుకోని స్వర్గం అంచుల వరకు వెళ్తారు. నవరసాలలోనూ అగ్రస్థానంగా నిలిచిన శృంగారం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. సెక్స్‌లో స్త్రీ ఎంత రెచ్చిపోతే అంత సుఖాన్ని అనుభవిస్తుంటాడు పురుషుడు. ఈ క్రమంలో పడకగదిలో స్త్రీల ప్రవర్తనను ఎనిమిది రకాలుగా అంటే అష్టవిధ శృంగార నాయికలుగా విభజించారు. అష్టవిధ శృంగార నాయికలు అంటే ఏమిటి..? వాటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

1. విరహోత్కంఠిత:

భర్త చెప్పిన వేళకు రాలేదని.. ఆలస్యానికి తహతహలాడి మనసంతా, రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ.

2. ఖండిత నాయిక:

తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారాక రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగాడిని చూసి దుఃఖించే స్త్రీ.

3. స్వాధీన పతిక :

తను చెప్పినట్లు విని, తను కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ

4. ప్రోషిత పతిక :

భర్త తనకు దూరంలో ఉన్నప్పుడు అతని తలపులను మనసున నెమరు వేసుకుంటూ విరహవేదన పడే స్త్రీ.

5. వాసక సజ్జిత:

దూరాన ఉన్న భర్త చాలాకాలం తరువాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో అందంగా ముస్తాబై, తన పడక గదిని అలంకరించి ఎదురు చూసే స్త్రీ.

6. విప్రలబ్ధ:

తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రానిపక్షంలో విరహంతో బాధపడే స్త్రీ.

7. కలహాంతరిత :

భర్త ఎంత చెప్పినను వినక అది అబద్ధమని వాదించి, అతనితో దెబ్బలాడి వెళ్లగొట్టి.. తరువాత అయ్యో ఎంత పనిచేసాను..ఎంత నొచ్చు కున్నాడో.. అని దిగాలు పడే స్త్రీ.

8. అభిసారిక:

అందంగా అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు తానే వెళ్ళేది లేదా ప్రియుడిని తన దగ్గరకే పిలిపించుకునే స్త్రీ.

Read more:

ఆ టైంలో వరసలు చూడను.. సొంత అన్నతో కూడా శృంగారంలో పాల్గొన్నా: షకీలా

శృంగారాన్ని పడక గదిలో ఒకే భంగిమలో చేస్తున్నారా..? ఇక అంతేనా..?

శృంగారంలో పీక్స్ చూస్తున్న మహిళలు.. సెక్స్ కోరికలు పెంచుకునేందుకు ట్రీట్మెంట్‌

Advertisement

Next Story