- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎండ్రకాయల పెంకులతో ఎకో-ఫ్రెండ్లీ బ్యాటరీ..
దిశ, ఫీచర్స్ : కాలుష్యరహిత శక్తి ఉత్పాదన కోసం గ్రీన్ సొల్యూషన్స్‌కు మొగ్గుచూపడం ఒక్కటే సరిపోదు. సంబంధిత టెక్నాలజీకి మద్దతిచ్చే బ్యాటరీలు కూడా పర్యావరణ అనుకూలంగా ఉండాలి. సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీల్లో ఉపయోగించే కెమికల్స్ విచ్ఛిన్నమయ్యేందుకు వందలు, వేల సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి మంటల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యకు విలువైన పరిష్కారం అందించే దిశగా యూఎస్ శాస్త్రవేత్తలు శక్తిని నిల్వ చేయడానికి క్రస్టేషియన్ షెల్స్ నుంచి తయారైన బ్యాటరీలను అభివృద్ధి చేశారు.
పీతలు, ఎండ్రకాయలు, రొయ్యలు వంటి క్రస్టేషియన్స్ జాతికి చెందిన సముద్ర జీవులు చిటిన్ వంటి కణాల నుంచి తయారైన ఎక్సోస్కెలిటన్స్ కలిగి ఉంటాయి. చిటిన్ అనేది ఒక రకమైన పాలిసాకరైడ్. ఇది ఆయా జీవుల పెంకులను గట్టిగా, నిరోధకంగా చేస్తుంది. కెమికల్ ప్రాసెసింగ్ తర్వాత ఎసిటిక్ యాసిడ్ సజల ద్రావణం సాయంతో చిటిన్.. బ్యాటరీ ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగించడానికి జెల్ మెంబ్రేన్‌గా సంశ్లేషణ చేయబడుతుంది. బ్యాటరీ లోపలి ఎలక్ట్రోలైట్ లిక్విడ్స్ లేదా పేస్ట్.. శక్తిని నిల్వ చేసేందుకు గాను బ్యాటరీ రెండు చివరల మధ్య చార్జ్‌డ్ మాలిక్యూల్స్(అయాన్లు) ప్రయాణించడానికి సాయపడతాయి. ఈ 'చిటోసాన్ ఎలక్ట్రోలైట్' బ్యాటరీని సురక్షితంగా ఉంచడమే కాక చౌకగా తయారుచేసేందుకు జింక్‌తో కలపబడింది.
బ్యాటరీ సృష్టికర్తలు 400 గంటల వరకు 1,000 బ్యాటరీ సైకిల్స్ పూర్తిచేసిన తర్వాత కూడా 99.7% ఎనర్జీ ఎఫీషియెంట్‌గా పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఈ బ్యాటరీలు వాటి పనితీరుకు ఎటువంటి హాని లేకుండా చార్జ్, డిశ్చార్జ్ ప్రక్రియలను త్వరగా చేయగలవు. ఇక ఈ బ్యాటరీలో మూడింట రెండొంతులు(చిటోసాన్‌తో తయారు చేయబడింది) కేవలం ఐదు నెలల్లో మట్టిలో కలిసిపోతుంది. ఇది పునర్వినియోగపరచదగిన జింక్‌ను ఉప ఉత్పత్తిగా మాత్రమే వదిలివేస్తుంది.
Also Read: 14 ఏళ్లుగా గర్భవతే.. వచ్చే ఏడాది మార్చిలో డెలివరీ
- Tags
- Telugu News
- Crab