సమోసా తినడం నేరం.. జైలుకెళ్లడం ఖాయం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

by Javid Pasha |
సమోసా తినడం నేరం.. జైలుకెళ్లడం ఖాయం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో కొన్ని విషయాలు వింత గొల్పుతుంటాయి. ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంది. ముఖ్యంగా ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వస్త్ర ధారణ వంటి నియమాలు కూడా ఇందులో భాగంగా ఉంటున్నాయి. పైగా వాటిని పాటించక పోతే కఠినమైన శిక్షలు అమలు చేస్తుంటారు. చివరికి సమోసా తిన్నా నేరంగా పరిగణించి జైలుకు పంపే దేశం కూడా ఒకటి ఉంది. ఇలాంటి వింత విశేషాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్కడ చూయింగమ్ తినలేరు

చాలా మందికి తెలుసో లేదో కానీ సింగపూర్‌లో చూయింగ్ గమ్ నిషేధం. దీనికో కారణం ఉంది.1992లో ఓ వ్యక్తి తన ఫోర్ వీలర్‌లో వెళ్తున్నప్పుడు చూయింగ్ గమ్ అంటుకోవడం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందట. రవాణా సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇక్కడ చూయింగమ్‌ను బ్యాన్ చేశారు.

సమోసా తింటే జైలుకే..

సమోసా అంటే చాలా మందికి ఇష్టం. కానీ సోమాలియా దేశంలో దీనిని అమ్మడం, తినడం నిషేధించారు. పొరపాటున ఎవరైనా తింటే నేరంగా పరిగణించి జైలుకు పంపుతారు. 2011 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది. సమోసా త్రిభుజాకార రూపం క్రిష్టియన్ హోలీ ట్రినిటీని సూచిస్తుంది. పైగా దీని మూడు పాయింట్లు క్రైస్తవుల పవిత్ర చిహ్నాలని నమ్ముతారు. కాబట్టి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడతాయట సోమాలియాలో.

బ్లూ జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు

రంగు రంగుల జీన్స్ వేసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా బ్లూ జీన్స్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఈ కలర్ జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు. నీలం రంగు తమకు శత్రుదేశమైన అమెరికాను గుర్తుకు తెస్తుందనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. అలాగే మలేషియాలో ఎల్లోకలర్ దుస్తులు వేసుకోవడం నిషేధం. 2015లో ఈ దేశ ప్రజలు పసుపు రంగు టీ షర్టులు ధరించి అక్కడి ప్రధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీనిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వ సంస్థల్లో, స్థలాల్లో పసుపు రంగు దుస్తులను వేసుకు రావడాన్ని నిషేధించించారు.

వీడియో గేమ్స్ కూడా..

కొన్ని దేశాలు వీడియో గేమ్స్‌ను ఎంటర్టైన్మెంట్ రంగంలో భాగంగా అంగీకరిస్తాయి. కానీ గ్రీస్‌‌లో మాత్రం ఇవి నిషేధిస్తూ 2002లో అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. కేవలం వీడియో గేమ్స్ మాత్రమే కాదు, ఎలాంటి ఇతర కంప్యూటర్ గేమ్స్ కూడా ఆడటానికి వీల్లేదట. ఇక ఫ్రాన్స్‌ విషయానికి వస్తే ఈ దేశంలో కెచ్‌అప్‌‌ని నిషేధించారు. స్కూల్ క్యాంటీన్‌లలో వాడటం మరింత తీవ్రమైన నేరమట. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడి వంటకాల సమగ్రతను, ప్రత్యేకతను కాపాడుతూ.. అమెరికా ఆహారపు అలవాట్లను నిరోధించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందట.

Advertisement

Next Story

Most Viewed