- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mushrooms: పుట్టగొడుగులు తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు!
దిశ, ఫీచర్స్: ప్రతి సీజన్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ సీజన్లలో వచ్చే కూరగాయలు, పండ్లు జనాలు తినడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకోవచ్చని నమ్ముతుంటారు. అయితే ఎండకాలం రాగానే మామిడి పండ్లు మార్కెట్‌లో విరివిగా దొరుకుతాయి. వాటిని తినడం వల్ల లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ చిన్నా పెద్ద ఇష్టంగా తింటుంటారు. అలాగే వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగులు అధికంగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా పొలాల దగ్గర ఉండే పుట్టలపై ఉంటాయి. గొడుగు ఆకారంలో ఉండటంతో.. వీటికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దసరా పండుగ సమయాల్లో వచ్చే పుట్టగొడుగులు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ కూరలో మాంసాహారంతో సమానంగా టేస్ట్‌ను కలిగి ఉండటంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరికి మాంసాహారం కంటే ఇవి అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. వెరైటీస్ చేసుకుని కుటుంబమంతా ఆరగిస్తుంటారు.
అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిల్లో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి పోషకాలను అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి. అలాగే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బలహీనత, బలహీన జ్ఞాపకశక్తి వంటివి తగ్గడంతో పాటుగా శరీరానికి లాభాలను కలిగిస్తాయి. పుట్టగొడుగులు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా అల్జీమర్స్, మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది. వీటిల్లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండర్‌గా పని చేసి హానికరమైన ప్రభావాన్ని తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మంచిది.
ఇటీవల కాలంలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్‌లోనే ముడతలు మచ్చలతో బాధపడుతున్నారు. దీంతో ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ సమస్య తగ్గడం లేదు. అలాంటి వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక అని చెప్పవచ్చును. వీటి వల్ల ముడతలు తగ్గడంతో పాటు వృద్దాప్యం తగ్గించడంలో సహాయపడుతాయి. పుట్టగొడుగుల్లో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. పుట్టగొడుగులు తినడంతో శరీరంలో కొవ్వు కరిగి ప్రోటీన్లు జీర్ణమవడానికి సహాయపడతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఇవి ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండిస్తారు కాబట్టి వీటిలో 80 నుంచి 90 శాతం వరకు నీటి శాతం ఉంటుంది. శరీరానికి నీటి శాతం ఎంత ఎక్కువగా అందితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి , రైబో ఫ్లేవిన్, నియాసిన్లు శరీరానికి చాలా అవసరం. ఇవన్నీ పుట్టగొడుగుల్లో కలిగి ఉంటాయి కాబట్టి తినడం వల్ల ప్రయోజనాలు పొందుతారు.
గమనికి: పైన అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందించాము. దీనిని దిశ ధృవీకరించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.