ఎనిమిదేళ్లలోపే పిల్లల్లో పీరియడ్స్.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

by Sujitha Rachapalli |
ఎనిమిదేళ్లలోపే పిల్లల్లో పీరియడ్స్.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో బాల్యంలోనే పీరియడ్స్ వస్తున్న పిల్లల సంఖ్య అధికం అయిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఎనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లోనే రుతుక్రమం స్టార్ట్ అయిపోతుంది. దీన్నే 'ముందస్తు యుక్తవయస్సు(Precocious Puberty)' గా పిలుస్తుండగా.. ఈ విషయం తల్లిదండ్రులు, ఆరోగ్య నిపుణులలో ఆందోళన పెంచుతుంది. ఋతుస్రావం అనేది నేచురల్ ప్రాసెస్ అయినప్పటికీ అది ముందుగానే జరగడం.. భావోద్వేగ, శారీరక, సామాజిక ప్రభావాలను కలిగి ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఏం చేయాలి? అనేది నేర్చుకోవడం తల్లిదండ్రులు ఈ క్లిష్టమైన సమయంలో పిల్లలకు మద్దతు ఇచ్చేందుకు సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.

కారణాలు

డైట్ : మోడ్రన్ డైట్స్.. ముఖ్యంగా రిచ్ ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్, ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం.. పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కెమికల్స్, అడిటివ్స్ కలిగిన హైలీ ప్రాసెస్డ్ ఫుడ్.. నేచురల్ గ్రోత్, డెవలప్మెంట్ పై ఇంపాక్ట్ చూపుతుంది. అధిక కేలరీలు, తక్కువ పోషకాలు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఫాస్ట్ గా ఎదిగిపోతారు. ఇది పిల్లల ముందస్తు ఋతుక్రమానికి దారితీస్తుంది.

ఊబకాయం : పుబెర్టీకి మేజర్ ఫ్యాక్టర్ ఊబకాయంగా పరిగణించబడుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ అధికంగా ఉన్న ఆడ పిల్లలు తోటి వారికన్నా ముందుగానే మెచ్యూర్ అవుతున్నారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు.. మెన్ స్ట్రువేషన్ కు కారణమయ్యే హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ లెవెల్స్ అధికం అయ్యేందుకు కారణం అవుతుంది. ఎర్లీగా పీరియడ్స్ వచ్చేందుకు దారితీస్తుంది.

పర్యావరణ కారకాలు, రసాయనాలు : ప్లాస్టిక్‌, పురుగుమందులు, గృహోపకరణాలలో కనిపించే ఎండోక్రైన్-అంతరాయం కలిగించే రసాయనాలు (EDCలు) వంటి పర్యావరణ విషపదార్థాలకు ఎక్స్ పోజ్ అవడం కూడా మరో కారణంగా సందేహం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లపై ఎఫెక్ట్ చూపుతాయి. యుక్తవయస్సుకు వచ్చే సాధారణ సమయానికి అంతరాయం కలిగించవచ్చు.

స్క్రీన్ టైం, తగ్గిన శారీరక శ్రమ : అధిక స్క్రీన్ టైం, తగ్గిన శారీరక శ్రమతో సహా మరింత నిశ్చల జీవనశైలి ముందస్తు యుక్తవయస్సుకు దోహదం చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం శరీర కొవ్వును పెంచుతుంది. హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది, యుక్తవయస్సు ప్రారంభాన్ని వేగవంతం చేస్తుంది.

మానసిక ఒత్తిడి : భావోద్వేగ, మానసిక ఒత్తిడి, ఫ్యామిలీ డైనమిక్స్, మెచ్యూర్ కంటెంట్‌కు ముందస్తుగా బహిర్గతం కావడం లేదా ట్రామాతో బాధపడడం కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్న బాలికలు లేదా ప్రారంభ జీవితంలో ఒత్తిడిని అనుభవించే వారు ముందుగానే యుక్తవయస్సుకు చేరుకునే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

జెనెటిక్స్ : ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. అమ్మాయి తల్లి లేదా క్లోజెస్ట్ రిలేషన్స్ ముందుగా ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తే.. పిల్లలకు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?

  • పిల్లలకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన సమతుల్య, పోషకాహారం ఇవ్వండి. ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్ కు దూరంగా ఉంచండి. అప్పుడే హెల్తీ గ్రోత్ ఉంటుంది.
  • ఆరోగ్యకరమైన బరువు మెయింటెయిన్ చేసేందుకు శారీరక శ్రమ అవసరం. కాబట్టి ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం కాకుండా బయట ఆడుకునేందుకు ప్రోత్సహించాలి.
  • ప్లాస్టిక్, BPA వంటి హానికర రసాయనాలకు ఎక్స్ పోజ్ కాకుండా చూసుకోండి. ఫుడ్ స్టోరేజ్ కోసం ప్లాస్టిక్ కాకుండా గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్ వాడండి. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల క్రిమిసంహారక మందులు వాడటం మానేయండి.
  • ముఖ్యంగా పిల్లల్లో ముందస్తు రుతుక్రమం సంకేతాలు కనిపిస్తే నిపుణులను సంప్రదించండి. ఈ సమయంలో ఎమోషనల్ సపోర్ట్ అందించండి. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయించడం మరవద్దు.
Advertisement

Next Story

Most Viewed