- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Snake - Cobra : పాము ఒక్క కాటుకు ఎంత విషాన్ని చిమ్ముతుంది?
దిశ, ఫీచర్స్:పాములు అంటే భయం, ద్వేషంతో కొందరంటే.. ఇంకొందరు జాలి, భక్తిని కలిగి ఉంటారు. వీటి చుట్టూ ఉండే అపోహలు ఇలాంటి భిన్నాభిప్రాయాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక్క కాటుకు ఎంత విషాన్ని చిమ్ముతాయనే విషయంలో కూడా చాలా అనుమానాలు ఉంటాయి. పాము అంటేనే విషానికి ప్రతిరూపంగా చూస్తారు కాబట్టి అనంతమైన పాయిజన్ దాని తలలో నిండి ఉంటుందనే భావన ఉంటుంది. కానీ ఇదంతా అవాస్తవం అని చెప్తున్నారు నిపుణులు.
నిజానికి స్నేక్ ఒకసారి కాటు వేసినప్పుడు విడుదలయ్యే విషం చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. దాని పరిమాణం, కాటు వేసే ముందు తీసుకున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు. దాని తలలో ఉన్న ప్రత్యేక గ్రంధులలో విషం సంశ్లేషణ చేయబడుతుంది. ఇది కొన్ని ప్రోటీన్స్, ఎంజైమ్స్, టాక్సిన్స్ కలయిక. వాస్తవానికి విషం ఉత్పత్తి అనేది ఒక జీవక్రియ. దీనికి సమయం, శక్తి అవసరం. కాగా ఇది రిలీజ్ అయ్యాక మళ్లీ విషాన్ని నింపుకోవాల్సి ఉంటుంది.
కోబ్రా: నాగుపాము వంటి విషపూరిత పాములు ఒక రోజులో సగటున 100-200 mg విషాన్ని ప్రొడ్యూస్ చేయగలవు. సగటు నాగుపాము కాటులో 50-100 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. ఈ విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు.
వైపర్: వైపెరిడే జాతికి చెందిన పాముల విషం ఉత్పత్తి రోజుకు 50-100 మి.గ్రా. ఇక ఈ పాము ఒక కాటుకు 20-50 మిల్లీగ్రాముల విషాన్ని కలిగి ఉంటుంది. ఈ విషం రక్త ప్రసరణ, కణజాలాలను ప్రభావితం చేస్తుంది, దీని వలన తీవ్రమైన వాపు, రక్తస్రావం జరుగుతుంది.
క్రైట్: క్రైట్ జాతి స్నేక్స్ రోజుకు 10-15 mg పాయిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. క్రైట్ కాటులో 5-10 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. ఈ విషం నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా ప్రమాదకరమైనది.