- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter లో తక్కువ నీరు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు
దిశ, ఫీచర్స్ : మన శరీరం 70 శాతం నీటితో తయారైంది. కాబట్టి బాడీని హైడ్రేట్‌గా ఉంచకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చలికాలంలో గాలిలో తక్కువ తేమ కారణంగా అజీర్ణం, డిటాక్సిఫికేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు బాడీకి తగినంత నీరు ఇవ్వడంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇన్ఫెక్షన్లను నివారించి, ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా పూర్తి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు రోజువారీ నీటిని తీసుకోవడంపై రాజీపడకూడదని సూచిస్తున్నారు నిపుణులు.
చలికాలంలో తగినంత నీరు తాగకపోతే ఏమి జరుగుతుంది?
చల్లని వాతావరణం వల్ల చెమట తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటాన్ని విస్మరిస్తాం. ఫలితంగా శరీరం నీటి కొరతతో దుష్ప్రభావాలకు గురవుతుంది. జీర్ణక్రియ, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, బరువు నియంత్రణ, డిటాక్సిఫికేషన్ మొదలైనవాటిని నిర్వహించడం కష్టతరం అవుతుంది.
1. దాహం రిఫ్లెక్స్
తగినంత నీరు తాగనప్పుడు, దాహం ప్రేరేపణ బలహీనపడుతుంది. ఫలితంగా హైడ్రేషన్ స్థితిని గుర్తించలేము. కాబట్టి సమస్యను నివారించడానికి మీరు ప్రతిరోజూ కనీసం 6-8 గ్లాసుల నీటిని తీసుకోవాలి.
2. ఎక్కువ మూత్రవిసర్జన
శీతాకాలంలో సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుందా? ఈ సమయంలో తక్కువ చెమట పట్టడం వలన, శరీరం మూత్రపిండాల ద్వారా ద్రవాన్ని విసర్జిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితిని కోల్డ్ డైయూరిసిస్ అంటారు.
3. పొడి బారిన చర్మం
చలికాలంలో చర్మం పొడిబారిపోతుందా? ఇందుకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. శరీరం తేమను నిలుపుకోదు. కాబట్టి ఎక్కువగా చెమట పట్టకపోయినా చర్మం నుంచి నీరు కనిపించదు.
డీహైడ్రేషన్‌తో ఎలా పోరాడగలరు?
* రిమైండర్‌లను సెట్ చేయడం ద్వారా తగినంత నీరు తాగుతున్నారని నిర్ధారించుకోండి.
* పుచ్చకాయలు, సిట్రస్ ఫ్రూట్స్ మొదలైన పండ్ల రసాల వంటి ఇతర పానీయాలను జోడించడానికి ప్రయత్నించండి.
* నిజానికి చాలా మంది దాహంతో ఆకలిని గందరగోళానికి గురిచేస్తారు. దీంతో అతిగా తినకూడని ఆహారాన్ని తినేస్తారు. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు ఏదైనా తినడానికి ముందు మొదట నీరు తాగండి.
* చర్మంపై డీహైడ్రేషన్ సంకేతాలు కనిపిస్తే.. దానిని బాగా మాయిశ్చరైజ్ చేయండి. ఎక్కువ నీరు తాగండి.
ఇవి కూడా చదవండి : ఎడారిలో మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం.. మరి Camels ఎలా ఉంటాయి..?