- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 5న 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం' జరుపుకుంటారు. 1962లో భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధాకృష్ణన్‌ను కలిసిన విద్యార్థులు.. ఆయన పుట్టినరోజున వేడుకలకు అనుమతించమని అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన సర్వేపల్లి.. ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని కోరారు. ఇక అప్పటి నుంచి అయన జన్మదినాన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిన పురస్కారాలు, గౌరవ సత్కారాలు జరుగుతాయి. అలాగే విద్యార్థులతో ఉపాధ్యాయులు ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలో తెలుసుకునేందుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం గొప్ప పాఠంగా గుర్తు చేసుకుంటారు. తన మేధస్సుతో రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా అందించిన స్ఫూర్తిని మననం చేసుకుంటూ విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే ఈ 'టీచర్స్ డే'ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 5న జరుపుకుంటారు.
Also Read : టీచర్స్‌ను వైసీపీ ప్రభుత్వం హింసకు గురిచేస్తోంది.. Pawan Kalyan
- Tags
- Teachers Day