ఆ విషయంలో క్షమాపణలు చెప్తే .. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే..

by Sujitha Rachapalli |
ఆ విషయంలో క్షమాపణలు చెప్తే .. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే..
X

దిశ, ఫీచర్స్ : మనం కొన్నిసార్లు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు మనస్తత్వ నిపుణులు. ' నేను ఎమోషనల్.అయినందుకు సారీ', ' కలువలేకపోయాను ఏమనుకోకండి ', ' నా సరిహద్దులు నొక్కి చెప్పడం వల్ల మీరు బాధపడ్డారు కదా క్షమించండి ' అని చెప్తుంటాం. కొన్నిసార్లు అపరిచితులకు కూడా చిన్న చిన్న విషయాల్లో ఇలా ఫర్ గివ్ చేయమని అడుగుతాం. కానీ ఇదంతా అవసరం లేదని... ఏ విషయాల్లో అస్సలు క్షమాపణలు కోరాల్సిన ఆవశ్యకత లేదో వివరిస్తున్నారు.

ఫీలింగ్స్

మన ఫీలింగ్స్ వల్ల ఇతరులు ఇబ్బండిపడినప్పుడు మనం ఆటోమేటిక్ గా క్షమాపణ చెప్పేస్తాం. కానీ మీ భావాలను అనుభవించే హక్కు మీకు ఉంది. కోపం, కలత, ఉల్లాసం అన్నీ మీ సొంతం. ఇలాంటివి ఎలాంటి అడ్డు లేకుండా ఎక్స్ పీరియన్స్ చేయడం మానసిక ఆరోగ్యం, స్వీయ అవగాహనకు సంకేతంగా చెప్తున్నారు. అతిగా క్షమాపణలు చెప్పడం మానేయడం.. ప్రామాణికంగా జీవించడం ఎలాగో నేర్చుకోవడంలో మొదటి అడుగుగా సూచిస్తున్నారు.

సరిహద్దులు సెట్ చేయడం

మన గురించి మనం సైడ్ తీసుకోవడంలో తప్పులేదు. ఇతరులకు నో చెప్పడం అస్సలు రాంగ్ కాదు అంటున్నారు. హద్దులు పెట్టుకోవడానికి ధైర్యం చేయడం అంటే మనం ఇతరులను నిరాశపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ మనల్ని మనం ప్రేమించుకునే ధైర్యం కలిగి ఉండటం అని గుర్తుంచుకోవాలి అని సూచిస్తున్నారు. అంతేకాని స్వార్థం, నిర్దయగా భావించి ఫీల్ అవకూడదని.. అది మీకు మీరు ఇచ్చుకున్న గౌరవంగా భావించాలని చెప్తున్నారు.

గతం

గతం గతః అంతే ఈ విషయంలో నో సారీస్. 'నేను చేసిన పనికి అపరాధంగా భావిస్తున్నా', ' నేను కోల్పోయిన అవకాశాల గురించి చింతిస్తున్నా ' లాంటివి ఉండకూడదు అంటున్నారు నిపుణులు. గతం మన ప్రయాణంలో భాగమని.. మనల్ని తీర్చిదిద్దే అంశమని చెప్తున్నారు. స్వీయ ఎదుగుదలకు దారి చూపే మార్గంగా చూడాలని అంటున్నారు. కాబట్టి ఇలాంటి రిగ్రెట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే మానుకోవాలని సూచిస్తున్నారు.

ఒంటరిగా సమయం గడపడం

ఈరోజుల్లో ఒంటరిగా సమయం గడపడం అంటే ఒంటరితనంగా పరిగణిస్తున్నారు. సంఘవిద్రోగంగా, మొరటుగా ప్రవర్తించడంగా భావిస్తున్నారు. అయితే ఒంటరిగా సమయం గడపడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని.. విశ్రాంతి, స్వేచ్ఛ భావాలకు దారితీస్తుందని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. కాబట్టి ఒంటరిగా గడపడం అనేది ఆరోగ్యకరం, అవసరం కూడా. ఇతరులకు దూరంగా ఉండటం కాదు.. ఇందుకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు.

అభిరుచులను కొనసాగించడం

ఇతరులకు టైం ఇవ్వకుండా మనకు నచ్చిన పనిపై ఎక్కువ సమయం వేచించినప్పుడు చాలా సార్లు క్షమాపణలు చెప్పే సందర్భాలున్నాయి. కానీ మన హ్యాబిట్స్ కొనసాగించడం అనేది మనలోని అంతర్భాగం. మన బ్రెయిన్ కు నచ్చే పని. మనకు ఆనందాన్ని, జీవితానికి అర్థాన్ని ఇచ్చే అలవాటు. కాబట్టి మన అభిరుచులపై సమయం కేటాయించడం.. దానికి ఇతరులు నొచ్చుకుంటున్నారని ఫీల్ అయిపోవడం అనేది అస్సలు దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని అంటున్నారు నిపుణులు.

Next Story