Beauty tips: ఫేషియల్ చేయించుకున్న తరువాత ఈ తప్పులు చేయకండి..!

by Kanadam.Hamsa lekha |
Beauty tips: ఫేషియల్ చేయించుకున్న తరువాత ఈ తప్పులు చేయకండి..!
X

దిశ, ఫీచర్స్: మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ నుంచి హెయిర్‌ స్టైల్స్‌ వరకు రకరకాల బ్యూటీ మెథడ్స్‌ చేయించుకుంటారు. ముఖ్యంగా ఫేషియల్ చేయించుకున్నప్పుడు కొన్నిసార్లు వారు ఆశించిన గ్లోనెస్ రాదు. ఒక్కొక్కసారి ముఖంలో గ్లోనెస్‌కు బదులు పలు రకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం ఫేషియల్‌కు ముందు, ఫేషియల్‌కు తర్వాత చేసే చిన్న చిన్నతప్పులే కారణం. ఫేషియల్ చేసిన వెంటనే మెరుపు రాదని.. దీనికి పలు రకాల జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఫేషియల్‌కు ముందు, ఫేషియల్ తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకోండి.

జిమ్‌కు దూరం: ఫేషియల్ తర్వాత జిమ్‌కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం మానుకోండి. ఎందుకంటే వాటి వల్ల ముఖంపై చెమట పట్టి, చర్మానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని మెరుపు కూడా తగ్గిపోతుంది. దీనికి బదులు ప్రతిరోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

థ్రెడ్ చేయించుకోకూడదు: ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తర్వాత థ్రెడ్ చేయించుకోకూడదు. ఇది ముఖంపై దద్దుర్లు వచ్చేలా చేస్తుంది. ఫేషియల్ తర్వాత వ్యాక్స్ చేయించుకోకపోవడమే మంచిది.

సూర్యరశ్మికి దూరం: ఫేషియల్ తర్వాత నేరుగా సూర్యకాంతిలో వెళ్లడం మంచిది కాదు. ఫేషియల్ తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది.. సూర్య కిరణాలు చర్మంపై నేరుగా పండడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సాయంత్రం పూట ఫేషియల్ చేయించుకోవడం బెటర్‌. పగటిపూట ఫేషియల్ చేయించుకున్నట్లయితే పార్లర్‌ నుంచి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించుకోవాలి.

ఫేష్ ప్యాక్‌కు దూరం: ఫేషియల్ తర్వాత కొన్ని రోజుల వరకు ఫేస్ ప్యాక్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఫేషియల్ తర్వాత చర్మంపై రంధ్రాలు తెరుచుకుంటాయి. ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖ చర్మంపై ఒత్తిడిని ఏర్పరచి సున్నితమైన చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed