గత జన్మ నిజంగా ఉంటుందా.. ఈ గుర్తులు వాటిసంకేతాలేనంట?

by samatah |   ( Updated:2023-08-09 06:15:08.0  )
గత జన్మ నిజంగా ఉంటుందా.. ఈ గుర్తులు వాటిసంకేతాలేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత జన్మ ఉంటుందా, అంటే కొందరు ఉంటుంది అంటే మరి కొందరు అలాంటిది ఏమీ ఉండదు అని కొట్టిపారేస్తారు. కానీ చాలా మంది నమ్ముతారు. ఏదైనా ప్లేస్ చూసినా లేదా, ఎవరైనా స్నేహితులు మనకు తెలియకుండానే మనపై కేర్ తీసుకున్నప్పుడు, మనం గత జన్మలో అక్కచెల్లెల్లం కావచ్చు అని ముచ్చటిస్తారు.

అయితే గత జన్మపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. కొందరు వాటిని అపోహ అని కొట్టిపరేస్తా మరి కొందరు నమ్ముతుంటారు. కానీ కొందరు పరిశోధకులు మాత్రం కొన్ని గుర్తుల ద్వారా గత జన్మ గురించి తెలుసుకోవచ్చు అంటారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మందికి విచిత్రమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వాటిని వారు కలలు అంటారు కానీ అవి గత జన్మకు సంబంధించిన గుర్తులంట. అంతే కాకుండా మనకు గత జన్మకు సంబంధించిన గుర్తులు కలలా వస్తాయంట. అలాగే ఎవరైన వ్యక్తిని మొదటి సారి చూసినప్పుడు ఎక్కడో చూశాం, నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి అని అనిపిస్తుంది. అయితే అది కూడా గతజన్మ గుర్తు కావచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇక అందరికి ఉండే సహజమైన భయాలు కాకుండా, కొందరు నీళ్లను, పక్షులను, నంబర్లను, మిర్రర్స్, మొక్కలను, కొన్ని రంగులను చూసి భయపడుతుంటారు. గత జన్మలో వాటివల్ల మరణం కలిగిందేమో అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి గుర్తులు గతజన్మ సంకేతాలంట.

Read More: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే రక్త ప్రసరణ తగ్గినట్లే

Advertisement

Next Story