Doctors: ఆపరేషన్ టైంలో డాక్టర్లు గ్రీన్ కలర్ డ్రెస్సే ఎందుకు ధరిస్తారో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-13 13:49:02.0  )
Doctors: ఆపరేషన్ టైంలో డాక్టర్లు గ్రీన్ కలర్ డ్రెస్సే ఎందుకు ధరిస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మీరెప్పుడైనా హాస్పిటల్‌కు వెళ్లారా? ఆపరేషన్ థియేటర్ వద్ద కానీ, లోపలకానీ గ్రీన్ కలర్ యూనిఫామ్ ధరించి ఉండే డాక్టర్లను గమనించారా? వారు ఈ కలర్ దుస్తులనే ఎందుకు ధరిస్తారంటే దానికో ప్రత్యేకత ఉంది. సహజంగా వెలుతురు ప్రదేశం నుంచి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు గ్రీన్ లేదా నీలం రంగు కలర్ డ్రెస్ ధరించి ఉండటం అనేది గుడ్ ఫీలింగ్ కలిగిస్తుందట. అంతేగాక ఆపరేషన్‌ చేసేందుకు సిద్ధపడే డాక్టర్లలో ఫోకస్ ఎనర్జీ (చూసే సామర్థ్యాన్ని) పెంచడంతోపాటు బ్లడ్ కనిపించినప్పుడు రెడ్‌ కలర్ డామినేషన్‌ను గ్రీన్ కలర్ తగ్గిస్తుంది. అయితే ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు నీలం లేదా తెలుపు రంగు దుస్తులను కూడా ధరిస్తున్నారు. కానీ గ్రీన్ డ్రెస్ ధరించడమే బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే డాక్టర్లు ఈ గ్రీన్ డ్రెస్ ధరించే సంప్రదాయం మొదటి నుంచి లేదు. మొదట్లో తెలుపు రంగు దుస్తులనే ధరించేవారు. 1914 తర్వాత మాత్రమే తెలుపు స్థానంలో ఆకుపచ్చ రంగును అందుబాటులోకి తెచ్చారు. నాటి నుంచి డాక్టర్లకు ఇది డ్రెస్ కోడ్‌గా మారిపోయింది.1998లో ఒక హెల్త్ సర్వే రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్‌గా పరిగణించే వైద్యుడు, ఢిల్లీలోని బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ నైన్ ఆపరేషన్ సమయంలో ఆకుపచ్చ రంగు డ్రెస్సును ధరించాడు.

Also Read...

చీకటి పడ్డాక ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టమే..!

Advertisement

Next Story