- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Photo technique: మీ ఫోన్‌తో ఫొటోలు అద్భుతంగా రావాలా?.. ఈ టెక్నిక్స్ యూజ్ చేయండి!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది ఆండ్రాయిడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. సౌకర్యంతోపాటు నచ్చిన విధంగా ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే కొందరు మంచి క్వాలిటీ రాదేమోనని ముఖ్యమైన సందర్భాల్లో స్టూడియోలకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. కానీ అలాంటి అవసరం లేకుండానే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా మీ వద్ద ఉన్న ఫోన్ కెమెరాతోనే అద్భతంగా ఫొటోలు దిగవచ్చు అంటున్నారు డిజిటల్ ఎక్స్‌పర్ట్స్ అవేంటో చూద్దాం.
* ఫొటోలు బాగా రావాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వాటిని తుడవడానికి మైక్రోరఫైబర్ క్లాత్ యూజ్ చేయండి. లెన్స్‌పై వేలిముద్రలు, మరకలు, దుమ్ము వంటివి ఉంటే ఫొటో క్వాలిటీ తగ్గుతుంది. అలాగే ఆండ్రాయడ్ కెమెరాలు గ్రిడ్ సెట్టింగ్స్ అందిస్తాయి. వాటిని సక్రమంగా సెట్ చేసి ఫొటోలు తీసుకోవాలి.
* అలాగే ఫోన్ కెమెరాను పైకి లేదా కిందకు స్లైడ్ చేస్తూ ఉంటే ఎక్స్‌పోజర్ లెవల్ మారుతుంది. దీనిని యాక్టివ్ చేయడానికి స్ర్కీన్‌పై నొక్కండి. బెస్ట్ రిజల్ట్ కోసం మీ షాట్‌లో లైటింగ్‌ను బట్టి ఎక్స్‌ప్లోజర్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఫొటోగ్రాఫిక్ లైటింగ్స్ సహజమైన కాంతిని అందిస్తాయి. ఉదయం లేదా సాయంత్ర వేళల్లో ఫొటో షూట్ చేస్తే గనుక ఫొటోగ్రాఫిక్ లైటింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది.
* ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలు అనేక రకాల షూటింగ్ మోడ్‌లు అందుబాటులోఉంటున్నాయి. ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు వాటన్నింటిని ఉపయోగించి చూడండి. ప్రో, హెచ్‌డీఆర్, పోర్ట్రెయిట్, నైట్ వంటి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలను బట్టి వీటిలో ఏది సెట్ అయితే అది యూజ్ చేయవచ్చు.
* ఫోన్ కెమెరా సెట్టింగ్‌లలో ఇమేజ్ కాంట్రాస్, బ్రైట్ నెస్, కలర్ చేంజ్ వంటివి యూజ్ చేస్తూ మీ ఫొటోలను చక్కగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఫొటో ఎడిటింగ్ టూల్స్, డిఫరెంట్ ఎడిటింగ్ అప్లికేషన్‌లను యూజ్ చేస్తూ ఫోన్లద్వారానే అద్భుతమైన చిత్రాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు.