ఆకలితో ఉన్నప్పుడు నిజంగా కోపం వస్తుందా? ఇది మన భ్రమేనా?

by Jakkula Samataha |
ఆకలితో ఉన్నప్పుడు నిజంగా కోపం వస్తుందా? ఇది మన భ్రమేనా?
X

దిశ, ఫీచర్స్ : కోపం రావడం అనేది సహజం. చాలా మంది కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ కొంత మంది వారికి అతిగా ఆకలి వేయడం వలన కోపానికి, చిరాకుకు గురి అవుతుంటారు. అయితే అసలు నిజంగానే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుందా? ఇది మన భ్రమనా అనే అనుమానం కలుగుతుంది. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం..కొందరు తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వలన చాలా సేపు తినకుండా ఉండిపోతారు. వారికి ఆకలిగా అనిపించినా సరే పని కంప్లీట్ చేశాక తిందాం అని అనుకుంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు తినకుండా ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గిపోయి, ఒత్తిడికి గురి చేసే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిసోల్, అండ్రెనలీన్ అనే ఒత్తిడికి గురి చేసే హార్మోన్ రిలీజ్ కావడం వలన అధిక కోపం వస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల మెదడు పని తీరులో మార్పులు కలుగుతాయి. ఇందువల్ల కొందరిలో కోపం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తుంటాం.

అయితే అందరిలో ఇది జరగదు. కొందరికి జస్ట్ ఆకలి మాత్రమే అయితే, మరికొందరికి ఆకలితో పాటు కోపం కూడా వస్తుంది. దీనికి కారణాలు వేరే కావొచ్చు. ముందు నుంచే కోపం, యాంగర్ ఇష్యూస్ ఉన్నవారికి ఆకలి కూడా ఓ కారణమైపోతుంది. దానివల్ల వారు ఆకలి వేసినప్పుడు మితి మీరిన అగ్రెషన్ తో ప్రవర్తిస్తారంటున్నారు నిపుణులు. అయితే ఆకలితో ఉన్నప్పుడు వచ్చే కోపాన్ని కంట్రోల్ కూడా చేసుకొవచ్చునంట. అది ఎలా అంటే? కంటి నిండా నిద్రపోవడం, ఎక్కువగా నీరు తాగడం, వీలైనప్పుడు ఏవైనా ఫ్రూట్స్, అల్పాహారం లాంటిది తీసుకోవడం, వ్యాయామం చేయడం వలన కోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story

Most Viewed