సమ్మర్‌లో జలుబు ఎందుకు అవుతుందో తెలుసా?

by Jakkula Samataha |
సమ్మర్‌లో జలుబు ఎందుకు అవుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : జలుబు రావడం అనేది సహజం. ఎక్కువగా శీతాకాలం లేదా వర్షాకాలంలో జలుబు అనేది ఎక్కువగా వస్తుంది. అయితే కొంత మందికి వేసవిలో కూడా జలుబు అవుతుంది. దీంతో చాలా మంది ఆలోచిస్తుంటారు. ఏంటీ? ఇది వేసవి కాలం కదా.. నాకు ఈ సమయంలో కోల్డ్ అయ్యింది ఏమిటి అని. అయితే వేసవిలో కూడా జలుబు అవుతుందంట. దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా శీతాకాలం, వర్షాకాలం ఎక్కువగా అంటు వ్యాదులు అనేవి వ్యాపిస్తుంటాయి. కానీ మారుతున్న జీవనశైలిని బట్టి సూక్ష్మ‌జీవులు కూడా తమ స్వభవాన్ని మార్చుకుంటున్నాయంటున్నారు నిపుణులు. అందుకే కాలం కానీ కాలంలో కూడా ఈ వ్యాధులు వస్తున్నాయంట. ముఖ్యంగా వేసవిలో జలుబురావడానికి కారణం వేడి గాలులు. ఈ సీజన్‌లో బలమైన వేడి గాలులు వీస్తుంటాయి. దీని వలన దుమ్ము, ధూళి, అలర్జీ వంటి కారకాలు వ్యాపించి, జలుబు, దగ్గు రావడానికి కారణం అవుతాయంట. అంతే కాకుండా సమ్మర్‌లో చాలా మంది ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతుంటారు. దీని వలన కూడా జలుబు అవుతుంటుంది. అదే విధంగా వ్యక్తిగత శుభ్రత, ఎక్కువ సమయం ఏసీలో గడపడం వలన ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి జలుబు వచ్చే అవకాశం ఉంటుందంట. అందువలన వేసవిలో ఎక్కువ కూల్ వాటర్ తాగడకుండా, వ్యక్తిగత శుభ్రత పాటించడం, దుమ్మ లేదా బయటకు వెళుతున్న సమయంలో మాస్క్ వేసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed