మందుల స్ట్రిప్ పై రెడ్‌లైన్‌ ఎందుకు ఉంటుందో తెలుసా..

by Sumithra |
మందుల స్ట్రిప్ పై రెడ్‌లైన్‌ ఎందుకు ఉంటుందో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ముందుగా దానిమీద ఉండే ఎక్స్పైరీ డేట్, ప్రైస్, ఇంగ్రీడియన్స్ లిస్ట్ చూస్తాం. అలాగే మెడికల్ లో మందులు తీసుకుంటే కాంబినేషన్స్, ఎక్స్పైరీ డేట్ ని గమనిస్తాం. కానీ ఎప్పుడైనా మందుల స్ట్రిప్‌ పైన ఉండే రెడ్ లైన్ ను గమనించారా. ఆ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా. దాన్ని ఏదో డిజైన్ అనుకుంటారు కానీ అది డిజైన్ కాదు.. దాని గురించి మెడికల్ షాపు వాళ్లను అడిగినా వారు సరిగ్గా సమాధానం చెప్పలేరు. కొందరైతే ఆ గీతని కంపెనీ డిజైన్ అనుకుంటారు. కానీ ఆ లైన్ చాలా ముఖ్యమైనది అని చాలా మందికి తెలియదు. మీకు ఆ రెడ్ లైన్ సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా.. ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది..

మెడికల్ షాపులో మందులు తీసుకున్నప్పుడు ఆ స్ట్రిప్ పైన బార్ కోడ్ తో పాటు.. రెడ్ గీత కూడా ఉంటుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2016 లో రెడ్ కలర్ గీతను గురించి అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేసింది. స్ట్రిప్ మీద ఎరుపు గీతకు ప్రత్యేకత ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎరుపురంగు గీత ఉన్న మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అస్సలు తీసుకోకూడదని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ మందులు యాంటీబయాటిక్స్ తో కూడుకున్నవని, వాటిని డాక్టర్ చెప్పకుండా వాడకూడితే సైడ్ ఎఫెక్ట్ వస్తాయని తెలిపింది. డాక్టర్ సలహాతో మాత్రమే యాంటిబయాటిక్స్ వాడాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed