రోడ్లపై కనిపించే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-15 15:30:30.0  )
రోడ్లపై కనిపించే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లకు తెలుపురంగు పెయింట్ వేయడం. అయితే చాలా మందికి ఓ డౌట్ వస్తుంది. అసలు రోడ్ల మీద సహజంగా ఉండేటువంటి చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారని. అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయంట. అవి ఏమిటంటే?

తెలుపు రంగు అనేది చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం నుండి చూసిన లేక చీకట్లో నడుచుకుంటూ వచ్చినా లేక వాహనాలు నడుపుతూ వచ్చే వారికి కూడా తెలుపు రంగు ఎంతో సులువుగా కనబడుతుంది. దాంతో ప్రమాదాలు అనేవి తగ్గుతాయని చెట్టుకు తెలుపు రంగు వేస్తారంట.

రెండో కారణం, చెట్లను కాపాడటం. సహజంగా చెట్లకు చెదలు పట్టడం సహజం. భూమి లోపల నుంచి చెదలు మొదలవుతుంది. అయితే ఆ చెదలు పురుగుతో చెట్లను కాపాడటానికి చెట్లు మొదళ్లలో తెలుపు రంగు వేస్తారంట. ఈ విధంగా తెలుపు రంగు పెయింట్ ను చెట్లకు వేయడం వల్ల చెద లేక పురుగులు పట్టవు దానివల్ల వాటికి బలం పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం పాటు బతుకుతాయంట.

ఇవి కూడా చదవండి ::

సోషల్ మీడియాకు దూరంగా ఉంటే జరిగే పరిణామాలివే?

స్వలింగ సంపర్కానికే ప్రాధాన్యతిస్తున్న కోతులు.. షాకింగ్ డిటెయిల్స్

Advertisement

Next Story

Most Viewed