పాములు కోరలు ఊకే ఎందుకు బయటకు తీస్తాయో తెలుసా?

by Jakkula Samataha |
పాములు కోరలు ఊకే ఎందుకు బయటకు తీస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : పాములు వీటిని చూడగానే చాలా మంది భయపడుతుంటారు. కొంతమందైతే వీటిని కలలో చూసినా భయపడుతుంటారు. అయితే పాములు ఎప్పుడూ తన కోరలను బయటకు,లోపలికి కదిలిస్తూ ఉంటాయి. అసలు పాము తన కోరలను ఊకే ఎందుకు బయటే ఉంచుతుంది? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దీనికి గల కారణం తెలుసుకుందాం.

విషపూరితమైన జీవుల్లో పాము ఒకటి. పంట పొలాల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా ఇవి ఎక్కువ తిరుగుతుంటాయి. ఇవి కప్పలు, ఎలకలను ఆహారంగా తీసుకుంటాయి. అయితే పాములు ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో కోరలను బయటకు తీస్తాయంట.

పాము బయటకు వచ్చే ముదు, తన ముందు ఏం ఉంది, బయట వాతావరణం ఎలా ఉందని తెలుసుకోవడానికి కోరలను బయటపెడుతుందంట. అంతే కాకుండా నా ముందు ఏమైనా ఆహారం ఉందా లేదా నాపై ఎవరైనా దాడి చేస్తున్నారా అనే విషయాన్ని కూడా కోరల ద్వారా తెలుసుకుంటుందంట.అందువల్లనే పాము పదే పదే తన కోరలను బయటపెడుతుంది అంటున్నారు నిపుణులు

Advertisement

Next Story

Most Viewed