- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భవతులను పాములు కాటెయ్యవు.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: పాములకు వాళ్లు వీళ్లు అనే భేదాలు ఉండవు. అవి వెళ్లే దారికి ఎవరు అడ్డం వచ్చిన కాటేస్తాయి. అంతే కాదు.. పాములు పగబట్టి మరీ చంపేస్తాయి. అయితే.. గర్భవతులను మాత్రం పాములు కాటెయ్యవట. అసలు గర్భం దాల్చిన వారి దగ్గరకు పాములు వెళ్లవట. పాములు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను కలిగి ఉంటాయి. వాటి ద్వారా స్త్రీ గర్భవతో కాదో సులభంగా గుర్తిస్తాయట. అయితే గుర్తించినంత మాత్రాన కాటు వెయ్యకూడదు అని ఏం లేదుగా అనుకుంటున్నారా? అసలు ఎందుకు పాములు గర్భవతులను కాటు వెయ్యవో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం.. ఒకానొక కాలంలో ఓ గర్భిణి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసిందట. ఆ సమయంలో రెండు పాముల కారణంగా ఆమె తపస్సుకు తపోభంగం కలిగిందట. అలా ఆమె తపస్సుకు భంగం వాటిళ్లడంతో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సర్పజాతికి గర్భిణిని చూసిన వెంటనే అంధత్వం (గుడ్డి) కలిగే విధంగా శాపం పెట్టిందట. అప్పటి నుంచి గర్భిణిని చూసిన పాములు గుడ్డివి అయిపోతాయని కథ సారాంశంలో ఉంది.
ఇంకో విషయం ఏంటంటే.. గర్భిణిని పాము కాటు వెయ్యకపోవడానికి కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు. శాస్త్రీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భం దాల్చిన మహిళ శరీరంలో హార్మోన్ల స్వరూపం భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆమె శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పులు జరుగుతాయి. స్వభావం, రంగు, రూపం వంటి చాలా మార్పులు కలుగుతాయి. ఈ హార్మోన్ల మార్పును కూడా పాములు త్వరగా గుర్తిస్తాయని కూడా ఓ వాదన ఉంది. అయితే శాస్త్రీయంగా నిరూపించేందుకు ఆధారాలు అందుబాటులో లేవు. కాగా.. ఎవరూ పాములను చంపకూడదు. కడుపుతో ఉన్న వాళ్ళు అస్సలు పాములు చంపకూడదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. అంతేకాకుండా ఆ శాపం కూడా తరతరాలు వెంటాడతాయని పురాణాలు చెబుతున్నాయి.
Read More: మీకంటూ ఒక లక్ష్యం ఉంటే.. ఒంటరి తనాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు