వర్షం వచ్చే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయో తెలుసా?

by Jakkula Samataha |
వర్షం వచ్చే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సీజన్ స్టార్ట్ కాకముందే వర్షాలు మొదలు అయ్యాయి. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రాంల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే వర్షం పడే ముందు కప్పలు అరుస్తాయని అంటారు. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో కూడా నైట్ టైం కప్పలు అరవడం ఉదయం వరకు వర్షం పడటం అనేది జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయని? కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

కప్పలు ఉభయచర జీవులు అని అందరికీ తెలిసిందే. కానీ ఇవి నీరు, తేమ లేకుండా బతక లేవు. ఎందుకంటే వీటికి శ్వాసించడానికి ఎక్కువగా నీరు లేదా తడి వాతావరణం అనేది చాలా అవసరం. ఇక దీని జీవితం మొత్తం నీటిలోనే మొదలు అవుతుంది. నీటిలో గుడ్లు పెట్టి అవి పొదగబడి టెడ్ పోల్ లార్వాలుగా నీటిలోనే బతుకుతాయి. అయితే కప్పలకు వర్షానికి లింక్ ఉన్నదా అంటే ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే? కప్పలు నీరు లేకుండా బతకలేవు కాబట్టి, వాటికి వర్షం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వర్షాకాలం లో స్వచ్చమైన నీరు నీరు దొరుకుతుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో ఎక్కువగా కీటకాలు వంటివి బయటకు వస్తాయి. దీంతో కప్పలకు ఆహారం దొరుకుతుంది. అంతే కాకుండా వర్షాకాలం వాటికి ప్రత్యుత్పత్తి సీజన్ కావడంతో అవి తమ తోడు కోసం అరుస్తాయి. అలా వర్షం పడే ముందు ఆడ కప్పలను వశం చేసుకోవడానికి, తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి మగ కప్పలు అనేవి పెద్ద గొంతుతో అరుస్తుంటాయి అంటున్నారు నిపుణులు. (నోట్ : ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే.. దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story