ఐదుగురిని పెళ్లాడినా ద్రౌపదిని పతివ్రత ఎందుకు అంటారో తెలుసా?

by samatah |   ( Updated:2023-06-07 14:43:14.0  )
ఐదుగురిని పెళ్లాడినా ద్రౌపదిని పతివ్రత ఎందుకు అంటారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మన మన పురాణాలలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా స్త్రీ గురించి. మన పురాణాలు, గ్రంథాలు ఎంతో గొప్పగా చెబుతుంటాయి. స్త్రీ పాతివ్రత్యమే ఆమె కుటుంబాన్ని కాపాడుతుంది అంటుంటారు. అయితే పురానాల ప్రకారంఅనేకమంది పతివ్రతలు ఉన్నారు వారిలో ఒకరు ద్రౌపది. మహాభారతంలో ఈమెది కీలక పాత్ర. అయితే ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయినా ఆమెను పతివ్రత ఎందుకు అంటారో ఇపపుడు తెలుసుకుందాం.

త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ ఇంద్రుడు సంహరించాడు.ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు.అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. అప్పుడు ఆయన ఇంద్రుడ్ని తపస్సు చెయ్యమని చెబుతాడు. అయితే ఆ సమయంలో దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు కాబట్టి పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నమ్మకమైన మిత్రుల దగ్గర దాచి ఉంచామని చెబుతాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యముడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు చేస్తాడు.

ఆ తర్వాత ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా.. నకుల,సహదేవులు జన్మించారు. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞ కుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. అందుకే ఆమె పంచ కన్యలలో ఒకరిగా.. పతివ్రతగా పేరు గాంచారు. అంటే ఇంద్రుడే ఐదురూపాలలో పాండవులుగా జన్మించగా, ఆయన భార్య అయిన శచీదేవి ద్రౌపదిగా జన్మిస్తుంది.

Advertisement

Next Story