కరెన్సీ నోట్లపై ఆ నలుపు గీతలు ఎందుకుంటాయో తెలుసా..?

by Sumithra |
కరెన్సీ నోట్లపై ఆ నలుపు గీతలు ఎందుకుంటాయో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరెన్సీ నోట్లను మనం నిత్యం మనం ఏదో ఒక అవసరానికి ఖర్చు చేస్తూనే ఉంటాం. ఎప్పుడూ మన జేబులో, వ్యాలెట్ లో ఉండే నోట్లని ఎప్పుడైనా గమనించారా. అసలు కరెన్సీ నోట్లపైన చివర ఉండే గీతలని ఎప్పుడైనా పరిశీలించారా. ఆ గీతలను బట్టే నోటు విలువ మారుతుందని తెలుసా.. అసలు ఆ గీతలతో విలువ ఎలా పెరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యం మనం వినియోగించే నోట్లపై ఉండే గీతలను 'బ్లీడ్ మార్క్స్' అని అంటారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం, అంధుల కోసం నోటుపై గీతలను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ లిపి ఎలా ఉపయోగపడుతుందో బ్లీడ్ మార్క్స్ అలా ఉపయోగపడతాయట. అంధులు బ్లీడ్ మార్క్స్ ను తడిమి అది ఎన్నిరూపాయ నోటో సులువుగా కనుక్కోగలరట. అందుకే 100, 200, 500, 2000 నోట్లపై గీతల సంఖ్యను మారుస్తూ, అలాగే వివిధ రకాల గీతలని పెట్టారట. నోట్లపై ముద్రించిన ఈ ప్రింటింగ్‌ను ఎంబోస్డ్ ప్రింటింగ్ అని పిలుస్తారు.

100 రూపాయల నోటులో రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 రూపాయల నోటు పై రెండు వైపులా నాలుగు గీతలు, ఉపరితలం పై రెండు సున్నాలు ఉంటాయి. ఇక 500 రూపాయల నోటుపై 5 గాట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం చలామనిలో ఉన్న 2000 రూపాయల నోటుపై రెండు వైపులా ఏడు లైన్లు ఉంటాయి. అంటే పూర్తిగా 14 గీతలు అన్న మాట. ఆ గీతలను తాకినప్పుడు అది ఎన్నిరూపాయల నోటో అర్థమవుతుంది. ఎవరైనా నోట్ ను తీసుకుని గీతలను తాకినప్పుడు కొంచం అలా పైకి లేస్తుంది. అలా నోటు విలువను గుర్తిస్తారు.

Advertisement

Next Story

Most Viewed