- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాఫింగ్ బుద్ధను ఆ ప్రదేశాల్లో పెడుతున్నారా.. ఆ తప్పు మాత్రం చేయకండి..
దిశ, ఫీచర్స్ : చాలా మంది ఇండ్లు, ఆఫీస్ లో లాఫింగ్ బుద్ధుని వాళ్లకి నచ్చిన ప్రదేశాల్లో పెడుతుంటారు. వీటిని ఇంట్లో ఆఫీస్ లో పెట్టుకుంటే అదృష్టం అని భావిస్తారు. అందుకే లాఫింగ్ బుద్దని ఇల్లు, రెస్టారెంట్, కార్యాలయాల్లో పెట్టుకుంటారు. అయితే, లాఫింగ్ బుద్ధ ను ఎక్కడపడితే అక్కడ పెట్టొచ్చా దానికి నిర్థిష్ట ప్రదేశం ఉంటుందా అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. మరి లాఫింగ్ బుద్దని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి లాఫింగ్ బుద్ధుడిని మన బుద్ధుని జపాన్ శిష్యుడు అని నమ్ముతారు. వీరి పేరు హోటెయి. అతను బుద్ధుడి నుండి బోధనలను విని నేర్చుకుంటూ అకస్మాత్తుగా బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఎక్కడ నివసించినా ప్రజలను నవ్వించడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండడంతో ప్రజలు అతన్ని లాఫింగ్ బుద్ధ అని పిలవడం ప్రారంభించారు. హోటెయి ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఉన్న బాధలను దూరం చేసి ప్రజలను నవ్వించేవాడని అంటారు.
లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచాలో తెలుసా ?
వాస్తుశాస్త్రం నియమాల ప్రకారం లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ప్రధాన ద్వారం ముందు కనీసం 30 అంగుళాల ఎత్తులో ఉంచాలి. ఇది కుటుంబానికి అదృష్ట స్థలమని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి మెయిన్ గేటుకు ఎదురుగా లాఫింగ్ బుద్ధ ముఖం ఉండేలా, డోర్ తెరుచుకోగానే ఇంట్లోకి వచ్చే వారి కళ్లు లాఫింగ్ బుద్ధ పై పడేలా పెట్టాలి. ఈ బొమ్మను గుమ్మానికి ఎదురుగా పెడితే ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతున్నారు.
లాఫింగ్ బుద్ధను ఎక్కడ ఉంచకూడదు ?
వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధను ఇంట్లో కొన్ని ప్రదేశాలలో ఉంచడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయట. ఇంట్లో కిచెన్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్, టాయిలెట్ దగ్గర లాఫింగ్ బుద్ధను ఎప్పుడూ ఉంచకూడదని చెబుతారు. అయితే, ఇది కాకుండా, నేరుగా నేల పై కూడా పెట్టకూడదని చెబుతున్నారు.