మహిళలు సాఫీగా మూత్ర విసర్జన చేయడానికి ఓ చట్టం ఉందని తెలుసా..?

by Sumithra |   ( Updated:2023-04-01 09:42:43.0  )
మహిళలు సాఫీగా మూత్ర విసర్జన చేయడానికి ఓ చట్టం ఉందని తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనం సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లినప్పుడు కొన్నిసార్లు టాయిలెట్ వెళ్లడానికి, అలాగే మంచినీళ్లు బయట దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ టాయిలెట్ విషయంలో మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదర్కోకుండా ఉండేందుకు ఒక చట్టం ఉందని మీలో ఎవరికైనా తెలుసా... అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు బయటికి వెళ్లినప్పుడు వారికి టాయిలెట్ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్లాలా అని మొహమాట పడతారు. అయితే అలా మొహమాట పడకుండా వారికి సమీపంలో ఉన్న హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్, చివరికి ఫైవ్ స్టార్ హోటల్ అయినా సరే ధైర్యంగా అందులోకి వెళ్లి టాయిలెట్‌ని వినియోగించుకోవచ్చు. అలాగే నీళ్లను కూడా తాగవచ్చు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే వారిమీద కంప్లెయింట్ కూడా ఇవ్వొచ్చు. అయితే ఇందుకు ఇండియన్ సె రైస్ యాక్ట్ 1867 ప్రకారం ఎక్కడైనా టాయిలెట్ యూజ్ చేసే హక్కు ఉంది.

మహిళల్ని ఆపే హక్కు ఏ హోటట్ యాజమాన్యానికి ఉండదు. ఒక వేళ ఏ హోటల్ వాళ్లయినా టాయిలెట్ యూజ్ చేయటానికి అభ్యంతరం చెబితే ఒక చిన్న కంప్లెయింట్ ఇస్తే చాలు... అప్పుడు ప్రభుత్వం హోటల్ నడవకుండా, ఆ హోటల్ లైసెన్స్‌ని రద్దుచేసే అవకాశం ఉంది. ఈ చట్టంతో ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితి అనుకున్నప్పుడు సమీపంలో ఉండే టాయిలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా మేనేజర్ మిమ్మల్ని అడ్డుకుంటే ఈ యాక్ట్ గురించి వారికి తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: నిద్రలో కాదు మెళకువతో ఉన్నప్పుడే.. బ్రెయిన్ యాక్టవిటీపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Advertisement

Next Story