నెలలు నిండకుండా పుట్టే పిల్లలో ఎలాంటి సమస్యలు కలుగుతాయో తెలుసా?

by Jakkula Samataha |
నెలలు నిండకుండా పుట్టే పిల్లలో ఎలాంటి సమస్యలు కలుగుతాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : తల్లి అవ్వడం ఓ గొప్ప వరం. తన కడుపులో నలుసు పడిందని తెలిసినతర్వాత నుంచే ఆ మహిళ తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం తీసుకుంటూ, ఆనందంగా గడపడానికి ట్రై చేస్తుంటుంది.

అయితే కొంత మందికి నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఇలా పుట్టిన వారిని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటుంటారు.ఇలాంటి వారు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

ప్రీ మెచ్చూర్ బేబీస్‌లో సరైన పోషకాహారం ఉండదు, ఇది నరాలభివృద్ధికి దారి తీస్తుంది. అందువలన ప్రీ నెలలు నిండకుండా పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలంట. అలాగే వీరిలో పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండటమే కాకుండా నేర్వెస్ వీక్ నెస్, బలహీనత ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ పిల్లలు త్వరగా కోలువకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం వీరికి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించడం అవసరం.

Advertisement

Next Story

Most Viewed