నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ధరించే చీరల స్పెషల్ ఏంటో తెలుసా?

by Jakkula Samataha |
నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ధరించే చీరల స్పెషల్ ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు అందరి దృష్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీదే ఉంటుంది. దీంతో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా తాను కట్టుకునే చీరల మీద చాలా ఫోకస్‌గా ఉంటారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన వారిలో ఎక్కువగా పురుషులే ఉండేవారు అప్పుడు చాలా మంది వారు ఏ రంగు బ్రీఫ్ కేసు తో వచ్చారు అనేదానిపై ఎక్కువ ఫోకస్ చేసేవారు. కానీ ప్రస్తుతం అందరూ నిర్మల సీతారామన్ చీరలపై ఫోకస్ చేస్తున్నారు.

కాగా, తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ఈనెల 23( ఈరోజు) బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో మంత్రి తెలుపు రంగు చీరలో తళుక్కున మెరిశారు. ఇక ఈమె బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారి, తాను కట్టుకున్న చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బడ్జెట్ రోజు నిర్మాలా సీతారామన్ భారతీయ చేనేత వస్త్రాలను ధరించి, స్పెషల్‌గా కనిపిస్తారు. కాగా నేడు ఆమె వాయిలెట్ కలర్ బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చేత చీరను కట్టుకుని, చేతిలో రెడ్ కలర్ బ్రీఫ్ కేసుతో ఎంతో హుందాగా, పద్ధతిగా కనిపిస్తున్నారు.

ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు ఈమె నీలి రంగు చీరలో ఆకర్షణీయంగా కనిపించగా, గతేడాది టెంపుల్ బార్డర్‌తో ఉన్న ఎరుపు రంగు చీర కట్టి స్పెషల్‌గా కనిపించారు.

ఇక 2019,20లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గులాబీ రంగు చీర, గోల్డెన్ కలర్ బార్డర్‌తో ఉన్న చీరలో కనిపించగా..2020,21లో లేత నీలం రంగు బార్డర్ తో ఉన్న పసుపు రంగు చీర ధరించారు. అదేవిధంగా 2021,22లో గ్రీన్ కలర్ బార్డర్‌తో ఉన్న ఎరుపు, తెలుపు రంగు పోచంపల్లి పట్టు చీరలో బడ్జెట్ ప్రవేశ పెట్టగా, 2022,23లో సిల్వర్ కలర్ అంచు, మెరూన్ కలర్ చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Advertisement

Next Story