ఒక నెల షుగర్ తినకపోతే ఏమౌతుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-25 12:10:02.0  )
ఒక నెల షుగర్ తినకపోతే ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి రోజూ ఏ ఆహారం తీసుకున్నా,ఏం తాగినా అది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం ఏది తీసుకున్నా లిమిటెడ్ గానే తీసుకోవాలి. మనలో కొంతమంది ఆహారంలో ఎక్కువ ఉప్పు తినడానికి ఇష్టపడతారు, మరికొందరు స్వీట్స్ ను తినడానికి ఇష్ట పడుతుంటారు. ఒక మనిషి ఒక నెల పాటు షుగర్ తినకపోతే అతని శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా? అసలు మనం ఒక రోజులో ఎంత చక్కెర తీసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం..

మీరు ఒక నెల పాటు చక్కెరని అస్సలు తీసుకోకపోతే, మీ శరీరానికి ఎలాంటి హాని ఉండదు. ప్రధానంగా రిఫైన్డ్ వైట్ షుగర్, బ్రైన్ షుగర్ ఇవన్నీ అనారోగ్యకరమైనవే. చైనాలో చైనీయులెవరూ తీపి పదార్ధాలు ఎక్కువ తీసుకోరు. అయినా అక్కడి వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వారు టీ, కాఫీ,పానీయాలు మొదలైన వాటిని తీసుకుంటారు. కాబట్టి మీరు చక్కెరకు బదులు ఖర్జూరాలు, పండ్లు వంటి ఆహార పదార్ధాలను తీసుకోవచ్చు. ఎందుకంటే వాటి నుంచి న్యాచురల్ షుగర్ లభిస్తుంది. ఇవి మన శరీరానికి ఎలాంటి హాని ఎందుకంటే అవి సహజ రూపంలో ఉంటాయి.ఇంతక ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు తేనె మరియు బెల్లం తినవచ్చు, కానీ మధుమేహం ఉన్నవారు, బెల్లం, తేనె, చక్కెర తీసుకోకూడదు.

Advertisement

Next Story

Most Viewed