రావణాసురుని పది తలల రహస్యం ఏంటో తెలుసా..

by Sumithra |
రావణాసురుని పది తలల రహస్యం ఏంటో తెలుసా..
X

దిశ, వెబ్ డెస్క్ : రామాయణం అంటేనే గుర్తొచ్చేది రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు. రావణున్ని రావణబ్రహ్మ అని కూడా పిలుస్తారు. ఇతను శివభక్తుడు, తపశ్శాలి. రామాయణంలో అన్ని పాత్రలు సాధారణంగా ఉన్న రావణుడు మాత్రం పది తలలతో విభిన్నంగా ఉంటాడు. వివిధ రామాయణాల్లో రావణుడి 10 తలలపై విభిన్న కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఆ కథనాలేంటో ఇప్పుడు చూద్దాం..

వాల్మీకి రామాయణం..

వాల్మీకి రామాయణం ప్రకారం కామరూప విద్యతో రావణాసురునికి 10 తలలు వచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు కోపోధృక్తుడైనప్పుడు, లేదా కామరూపడైనప్పుడు 10 తలలు, 20 చేతులు వస్తాయని కథనం. వాటితో పాటుగానే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కూడా ఉంటాయని కథనం. అవి ఏంటంటే కామం, క్రోదం, దురాశ, మోహం, మదం, అసూయ, అహంకారం, చిత్త శుద్ధి, హృదయం, బుద్ధి.

విచిత్ర రామాయణం ప్రకారం..

దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో విశ్వవసు ఒకానొక రోజు తన భార్య కైకసి చెంతకు వెళ్తాడు. అప్పటికే కైకసి 11 సార్లు రుతుమతి అయినట్లు విశ్వవసుకి తెలుస్తుంది. ఆమె ద్వారా 11 మంది కుమారులు కణాలని అతను భావిస్తాడు. కానీ కైకసి తనకు ఇద్దరు కుమారులు చాలంటూ ఆమె భర్త విశ్వవసుకు చెబుతుంది. తపోనిధి విశ్వవసు తన మాట పొల్లుపోకూడదని 11 మంది సంతానాన్ని కంటాడు. 10 తలలు ఉన్న రావణుడిని 10 కుమారుడిగా, కుంభకర్ణుడిని పదకొండో వాడిగా జన్మను ఇచ్చాడని విచిత్ర రామాయణం చెబుతుంది. అయితే వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు సనకసనందనాది రుషుల శాపంతో త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఇక మరో కథనం ప్రకారం భక్త ప్రహల్లాద తండ్రి హిరణ్యకశిపుడిని నరసింహావతరాంలో విష్ణుమూర్తి సంహరిస్తాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు అకస్మాత్తుగా పుట్టి ఇరవై గోళ్లతో నన్ను చంపడం గొప్పేనా అని అన్నాడట. అప్పుడు నారాయణుడు నీవు మరో జన్మలో 10 తలలు, 20 చేతులతో జన్మించెదవు, అప్పుడు నేను మానవుని అవతారంలో పుట్టి నిన్న సంహరిస్తాను అని చెప్పాడని కథనం.

Advertisement

Next Story