రంజాన్‌కు, ఖర్జూరకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-14 15:01:56.0  )
రంజాన్‌కు, ఖర్జూరకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
X

దిశ, పీచర్స్ : రంజాన్ మాసం మొదలైంది. ముస్లీంలకు ఎంతో పవిత్రమైన మాసం ఇది .ఇక రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఉపవాసం. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరు.అయితే రంజాన్ నెల మాసంలో పాటించే ఉపవాసానికి ఖర్జురాకు స్పెషల్ సంబంధం ఉంటుంది. ఎందుకంటే రంజాన్ ఉపవాసం అనేది ఇప్తార్‌తో ముగుస్తుంది. అంటే ఇప్తార్ భోజనాన్ని ఖర్జూరతో ప్రారంభించి, ఖర్జూర తో ముగిస్తారు.

అయితే ఇలా ఖర్జూరతో ఇఫ్తార్ ముగించడానికి, ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ సంప్రదాయం, బోధనలలో ఖర్జూరకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారంట. ప్రవక్త మహమ్మద్ స్వయంగా ఖర్జూరతో ఉపవాసాన్ని విరమించాడంట. అలాగే సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో దొరికే ఖర్జూర పండ్లని ప్రవక్త స్వర్గం నుండి పంపించాడని అంటారు. అంతే కాకుండా, ఖర్జూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ముస్లీంలు ఖర్జూరతో ఉపవాస దీక్షప్రారంభించడం, విరమిచడం చేస్తారంట. అంతే కాకుండా వీటిలో డైటరీ ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం ,హై-ప్రోటీన్ కంటెంట్ శక్తిని, బలాన్ని తక్షణమే అందిస్తుంది. అందువలన ఖర్జూరను ఉపవాస దీక్షలో తప్పనిసరిగా ఉపయోగిస్తారంట.

Advertisement

Next Story

Most Viewed