మిమ్మల్ని మీరు హాగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

by Prasanna |
మిమ్మల్ని మీరు హాగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత సమాజంలో ఎవరి పనుల్లో వారు బిజీ ఉంటున్నారు. కొంత మంది ఒత్తిడికి గురవుతుంటారు. మరి కొందరు మనసులో ఎన్నో బాధలు పెట్టుకొని.. పైకి సాధారణంగా ఉంటారు. వీరు ఎదో పోగొట్టుకున్నట్టు.. మోహంలో ఒక ఆనందం , ఒక ఉత్సాహం ఏమి ఉండవు . ఎదో ఉన్నామంటే.. ఉన్నట్టు ఉంటారంతే. వారికి ఇష్టమైన వారితో వారి సంతోషాన్ని, కష్టాలను పంచుకోవాలనుకుంటారు. కానీ ఆ అదృష్టం అందరికి దక్కదు. ఇంకా మనలో మరి కొంత మంది మానసికంగా కుమిలి కుమిలి పోతుంటారు. ఆ సమయంలో వారికి బాగా దగ్గరున్న వారు ఒక హాగ్ ఇవ్వడం వల్ల వాళ్ల వేదన నుంచి బయట పడే అవకాశం ఉందట . దీనిపై పరిశోధనలు కూడా చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకొందరు వారి విషయాలను ఎవరికి చెప్పుకోకుండా లోలోపల కుములుతూనే.. నరకంగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వారు ఒంటరితనంతోనే ఎక్కువ స్నేహం చేస్తారు. వారిలో వారే బాధలను దిగమింగుతుంటారు. గట్టిగా ప్రయత్నిస్తే ఒంటరిగా కూడా.. వారి సమస్యలనుంచి బయటపడొచ్చు. మీ మనస్సుకు తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే కౌగిలించుకోవడానికి ప్రయత్నిచండని ఆరోగ్య నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed