Black Milk: నల్లటి పాలు ఇచ్చే ఈ జంతువు గురించి తెలుసా?

by Prasanna |   ( Updated:2024-07-24 15:52:40.0  )
Black Milk: నల్లటి పాలు ఇచ్చే ఈ జంతువు గురించి తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మన ఇళ్లల్లో ఎక్కువగా పాలను వాడుతుంటాము. ఆవు పాలు, గేదె పాలను ప్రత్యేకంగా కాఫీ, టీ , పెరుగు వంటి గృహ అవసరాలకు కోసం ఉపయోగిస్తారు. పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు పాలను తాగుతుంటారు. మరి కొందరైతే మేక పాలను తాగుతుంటారు. అయితే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న జంతువుల పాలు తెల్లగా ఉంటాయని మనకి తెలుసు. కానీ, నల్లగా పాలు ఇచ్చే యానిమల్స్ ఉన్నాయని తెలుసా .. మీరు చదువుతున్నది నిజమే నల్లగా మిల్క్ ఇచ్చే జంతువు కూడా ఉంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వెయ్యిలో ఒకరు మాత్రమే ఈ నల్ల పాల గురించి విని ఉంటారు. అయితే, ఈ నలుపు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుంచి వస్తాయి. వాటిని అక్కడ ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని పిలుస్తుంటారు.ఈ జంతువు ఇచ్చే పాలు బాగా నల్లగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచం కూడా కొవ్వు ఉండదు . ఇవి ఆర్యోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఈ పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయని అంటున్నారు. ఖడ్గమృగం పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.


Read more...

Snakes: ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఉందని తెలుసా..! ఎక్కడో కాదు మనదేశంలోనే..

Advertisement

Next Story

Most Viewed