24 గంటలు వైఫై రూటర్‌ ఆన్‌ చేసే ఉంచుతున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

by Prasanna |
24 గంటలు వైఫై రూటర్‌ ఆన్‌ చేసే ఉంచుతున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం వేరే ఊళ్లకు వెళ్లే వారు.. కానీ ఇప్పుడు ప్రతీ ఇంట్లో నెట్ కనెక్షన్ ఉంటుంది. క్రమంగా వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల రాకతో ఇంటర్నెట్ కనెక్షన్లు అమాంతం పెరిగాయి. వై-ఫై రూటర్ లేని ఇల్లు లేదనడంలో సందేహం లేనంతగా పరిస్థితి మారిపోయింది. అయితే మనలో చాలా మంది 24 గంటలు వైఫై రూటర్ ఆన్ చేసే ఉంచుతారు.. కానీ ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. Wi-Fiని ఆన్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

వైఫై రూటర్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచినట్లయితే, అది నిరంతరం విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తుంది. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మీరు నిద్రించే గది పక్కనే రూటర్ ఉంటే మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇది నిద్రలేమికి కారణమవుతుందని కూడా వైద్యులు అంటున్నారు. అందుకే మీరు నిద్రపోయే ముందు మీ వైఫై రూటర్‌ని ఆఫ్ చేయాలి.

రాత్రంతా వైఫై రూటర్‌ని వదిలేస్తే.. అది వెలువరించే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed