పాదాల్లో మంట, దురద, తిమ్మిర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారౌతారు!

by Anjali |
పాదాల్లో మంట, దురద, తిమ్మిర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారౌతారు!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మందికి పాదాల్లో మంటలు, తిమ్మిర్లు, సూదులతో పొడవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది వీటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. పాదాల్లో మంటలు రావడానికి మధుమేహం కూడా ఓ కారణమని నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే శరీరంలో ఎర్ర రక్త కణాలు, విటమిన్ బి లోపం వల్ల కూడా పాదాల్లో మంటలు వస్తుంటాయి. శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోతాయి.

దీంతో పాదాల్లో మంటలు వస్తాయంటున్నారు నిపుణులు. కాగా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలంటున్నారు. ముఖ్యంగా విటమిన్ లోపం వల్లనే పాదాల్లో మంటలు వస్తాయని.. విటమిన్ బి 12 అండ్ విటమిన్ బి6 లోపిస్తే పాదాల్లో తీవ్రమైన నొప్పి, అరికాళ్లలో మంట వస్తుందని, నిలబడి ఉన్నప్పుడు కాళ్లు బరువుగా అనిపించడం, కాళ్లలో నొప్పులు, పాదాల్లో దురద వంటివి న్యూరాస్తీనియా యొక్క ముఖ్య లక్షణాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒక్కోసారి థైరాయిడ్ అరికాళ్లలో మంటను సూచిస్తుందట. తక్కువ థైరాయిడ్ స్థాయిలు కాళ్లలో మంటలు కలిగిస్తాయట. అంతేకాకుండా కిడ్నీలో ఏమైనా సమస్యలున్న పాదాల్లో నొప్పి, దురద, అరికాళ్లలో మంట వస్తుందట. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోయినా వ్యర్థ పదార్థాలు, ద్రవం మీ బాడీలో పేరుకుపోతుందని.. తద్వారా కిడ్నీపై ఎఫెక్ట్ పడి.. ఇతర సమస్యలను కూడా కొనితెచ్చుకున్నవారవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే గుర్తించి.. డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story