- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?.. అయితే ఈ కష్టాలు తప్పవు
దిశ, ఫీచర్స్: కొందరు టీ తాగిన తర్వాత, తాగడానికి ముందు నీళ్లు తాగుతుంటారు. ముందు తాగితే పర్వాలేదు కానీ, టీ తాగిన వెంటనే తాగితే నీళ్లు తాగడం మంచిది కాదు. నిజం చెప్పాలంటే.. టీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినప్పటికీ మెదడు ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి, టెన్షన్ రిలీఫ్ కోసం తాగుతుంటారు.
కొంత మందికి అది వ్యసనంలా మారుతుంది. అయితే టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం, అతిగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే జరిగే నష్టాలేమిటో తెలుసుకుందాం.
* ఒక కప్పు టీలో 50 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది. అందుకోసం చాలా మందికి టీ తాగిన తర్వాత దాహం వేస్తుంది. కానీ ఆ సమయంలో నీళ్లు తాగితే అసిడిటీ లేదా కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు నుంచి రక్తం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
కాబట్టి టీ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండడమే మంచిది. దంత సమస్యలు ఉన్నవారు కూడా వేడి వేడి పానీయాలు తీసుకున్న వెంటనే చల్లని నీళ్లు తాగితే దంతాలపై చెడు ప్రభావం పడుతుంది.
బెల్లం టీతో ప్రయోజనాలు
చాలా మందికి టీ అలవాటు మానుకోవడం కష్టం. అలాంటప్పుడు టీలో షుగర్‌కి బదులు స్వచ్చమైన బెల్లం కలిపిన టీ తాగితే మంచిది. దీనివల్ల శరీరానికి ఎటువంటి హానీ ఉండకపోగా మేలు జరుగుతుంది.
1 టీలో పంచదార కలుపుకుని తాగడంవల్ల బరువు, బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. అందుకే చక్కెరకు బదులుగా బెల్లం కలుపుకోవడం బెటర్. బెల్లంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్య నివారణకు దోహదం చేస్తాయి.
2 చాలా మందికి వయస్సు పెరిగే కొద్దీ రక్తహీనత సమస్య మొదలవుతుంది. దీంతో బాధపడే వ్యక్తులు సాధారణ పని చేయడం వల్ల కూడా తొందరగా అలసి పోతుంటారు. ఇలాంటి పరిస్థితిలో బెల్లం టీ తాగితే అందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తహీనతను నివారిస్తుంది.
3 బెల్లం టీ తాగడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఎలాంటి పొట్ట సమస్యలు రావు. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
మొత్తానికి టీ మానుకోలేని వారు బెల్లం టీ అలవాటు చేసుకోవచ్చు. అలాగే టీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉన్నవారు కూడా ఈ అలవాటును మానుకోవాలి. టీ తాగిన తర్వాత 30 నిమిషాలకు నీళ్లు తాగకపోవడం మంచిది.