- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drinking Water While Eating?: భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..?
దిశ, న్యూస్: నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అలా అని ఎప్పుడుబడితే అప్పుడు విపరీతంగా నీళ్లు తాగడం మంచిది కాదు. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు, ఆ తరువాత రోజు మొత్తం మీద శరీరానికి తగినంత నీరు మాత్రమే తాగాలి. చాలా మంది భోజనం చేస్తున్నప్పుడు నీళ్లను తాగితే, తర్వగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. అందుకే భోజన సమయంలో చాలామంది ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. మరికొందరు భోజన సమయంలో నీళ్లు తాగడం మంచిది కాదని, ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే, భోజనం సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిదే. ఆహారంలో ఉండే పోషకాలు సులభంగా పేగుల్లో కదులుతూ.. శరీరానికి మేలు కలుగుతుంది. దీని వల్ల మలబద్ధక సమస్య అనేది దరిచేరదు. కానీ, భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిదే కదా అని ఎక్కువగా నీళ్లు తాగకూడదు. దీని వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
భోజనం తరువాత కూడా..
చాలామంది భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. ఇది సరైన విధానం కాదు. భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అవుతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే విధానంలో మార్పులు వచ్చి, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొందరికి భోజనం తిన్న వెంటనే నీళ్లు ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. అలా అని అతిగా నీళ్లు తాగడం వల్ల ఆహారం తర్వగా విచ్ఛిన్నమై వేగంగా జీర్ణమైపోతుంది. దీని వల్ల తర్వగా ఆకలి వేసి, మళ్లీ భోజనం చేయాలని అనిపిస్తుంది. ఇలా ప్రతీసారి చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
ఇలా తీసుకోవడం మంచిది:
అయితే, భోజనం చేయడానికి ఒక గంట లేదా అరగంట ముందు ఒక అర గ్లాసు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంలోని పోషకాలను శరీరం ఈజీగా గ్రహిస్తుంది. ఆహారం తీసుకోవడానికి ముందు నీళ్లు తాగితే కొంత కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని కారణంగా భోజన సమయంలో ఆహారంను తక్కువగా తింటారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. తక్కువ ఆహారం, దానితో పాటు కొంచెం నీరు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది.
కూల్‌డ్రింక్స్:
చాలామంది బయట హోటళ్లు, రెస్టారెంట్‌లలో భోజనం చేసే సమయంలో కూల్‌డ్రింక్స్, సోడాలు, కెఫిన్ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇలా ప్రతీసారి చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అందవు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్‌డ్రింక్స్, కెఫిన్ వంటి వాటిని తాగకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. drinking water while eating?drinking water while eating?
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.