మీకు నిద్రలో ఏడుస్తున్నట్లు కలలు వస్తున్నాయా..అయితే మీకు ఏం జరుగబోతుందో తెలుసుకోండి!

by Jakkula Mamatha |
మీకు నిద్రలో ఏడుస్తున్నట్లు కలలు వస్తున్నాయా..అయితే  మీకు ఏం జరుగబోతుందో తెలుసుకోండి!
X

దిశ,వెబ్‌డెస్క్: రోజంతా పనిలో అలసిపోయి రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రిస్తారు. ఇక నిద్రలో మునిగిపోయాక సాధారణంగా చాలా మందికి కలలు వస్తాయి. కొందరు అయితే వారికి వచ్చే కలల గురించి ఇతరులతో చెప్పుకొని అసలు దానికి కారణం ఏంటని తెలుసుకోవాలని తపన పడతారు. మరికొందరు అయితే అసలు కలలను పట్టించుకోరు. వాస్తవానికి కలలు రావడం కామన్ విషయం. ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు. వాటిలో కొన్ని మంచివి కావచ్చు కొన్ని చెడువి కావచ్చు. కానీ ప్రతి కల వెనుక ప్రత్యేకమైన అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే కలలు భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంఘటనల గురించి తెలియజేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిద్రిస్తున్నప్పుడు కలలో ఏడుస్తున్నట్టు కనిపిస్తే ఏం అవుతుందో తెలుసుకుందాం.

మీకు నిద్రలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించినట్లయితే శుభప్రదం అని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంతే కాదు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని ఆ కల సూచన. ఇలాంటి కల ఎప్పుడైనా వస్తే ఎవ్వరికీ చెప్పకూడదంట. అలాగే కలలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏడిస్తే ఇంటికి ఓ కొత్త సభ్యుడు వస్తాడంట. అలాగే ఇలాంటి కల వల్ల మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో పాటుగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కలలో మీకు ఎవరో తెలియని వ్యక్తి ఏడుస్తూ కనిపిస్తే మీరు ఏదో విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి కల వస్తే మీరు ఒత్తిడి నుంచి బయట పడడమే కాకుండా జీవితంలో ఆనంద కూడా వస్తుంది అని చెబుతున్నారు. మీ కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం. ఈ విధంగా మీ కలల వెనుక ఉన్న రహస్యాలను స్వప్న శాస్త్రం వివరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed