మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

by Kavitha |
మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది ప్రతి రోజు పప్పు తింటారు. మరికొంత మంది వారానికి రెండు సార్లు అయినా వండుకొని తింటారు. ఇంట్లో చేపలు, చికెన్‌ వంటి మాంసాహారాలు ఎన్ని ఉన్నా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైగా పప్పు, అన్నం మంచి కాంబినేషన్‌ కూడా. అందుకే వీటిని ‘కంఫర్ట్ ఫుడ్స్’ అంటారు. పప్పు చేసిన వంటకాలు వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పప్పులో లభించే పోషకాలు మరే ఇతర ఆహారంతో సరిపోలవు. అయితే ఒక్కోసారి వంట చేసేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్‌ వల్ల పప్పు తిన్న తర్వాత కూడా అందులోని పోషకాలు శరీరానికి అందవు. అందుకే పప్పు వండే విధానం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం కాలంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లో పప్పులు ఉడకబెట్టి వంట చేస్తుంటారు. నీటిలో నానబెట్టడం నుంచి ఉడకబెట్టడం వరకు – పప్పు వండడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ సేపు ఉడకబెట్టవద్దు:

బేసిక్ పప్పును తప్పనిసరిగా ఉడకబెట్టాలి. కానీ ఎక్కువ సేపు ఉడకనీయవద్దు. ప్రెషర్ కుక్కర్‌లో లేదా సాస్ ప్యాక్‌లో పప్పులను ఎక్కువసేపు నీటిలో ఉడకబెట్టడం వల్ల దానిలోని ప్రోటీన్‌ను నాశనం అవుతుంది. పప్పులను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్‌లు నశిస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఫైటిక్ యాసిడ్ గాఢత తగ్గుతుంది. అలాగే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ సమతుల్యత కోల్పోతుంది. కాబట్టి పప్పును ఎక్కువ సేపు ఉడక పెట్టకపోవడం మంచిది.

నీటిలో నానబెట్టి ఉడికించాలి:

పప్పును నీళ్లలో నానబెట్టకుండా ఉడికించకూడదు. నీటిలో నానబెట్టకపోతే, పప్పుకు ఎటువంటి పోషకాలు అందవు. పైగా నానబెట్టకుండా చేసిన పప్పు ఆహారంలో తీసుకుంటే జీర్ణ రుగ్మతలు సంభవించవచ్చు. నీటిలో నానబెట్టిన తర్వాత పప్పు వంటకు వినియోగిస్తే సులభంగా జీర్ణమవుతుంది. పప్పులలో ఫైటిక్ యాసిడ్, టానిన్లు వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల శోషణను నిరోధిస్తాయి. ఉడికించే ముందు పప్పును 8-12 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే పప్పుధాన్యాల్లోని పోషకాలు రెట్టింపు అవుతాయి. పైగా పప్పులు త్వరగా ఉడుకుతాయి కూడా.

పప్పుకు ఎంత నీరు కలపాలి:

ఒక కప్పు పప్పును కొలిచి, అందులో రెండు కప్పుల నీరు తీసుకుంటే చక్కగా ఉడుకుతుంది. నీరు ఆవిరై పోయే వరకు పప్పును ఉడకబెట్టవచ్చు. అనంతరం అవసరమైన మేర మళ్ళీ నీరు కలుపుకోవచ్చు. కానీ ఉడికించిన తర్వాత అదనపు నీటిని పారవేయకూడదు. పప్పు నుంచి విటమిన్ బి, సి బయటకు వస్తాయి. ఆ నీటిని కూడా వంటకు వినియోగించాలి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed